ఆకాశం నుంచి ఎప్పుడు ఏమి ఊడిపడతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా గుజరాత్‌లో  లోహపు బంతులు ఆకాశం నుంచి రాలి పడుతున్నాయి. గుజరాత్ సురేంద్ర నగర్ జిల్లా సైలా గ్రామంలోని పంటపొలాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్న వింత వస్తువులను గ్రామస్తులు చూశారు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ముందుగా గుర్తించలేకపోయారు. కానీ తర్వాత ...ఆకాశం నుంచి పడుతున్నాయని గుర్తించారు. నలుపు, సిల్వర్‌ రంగులో ఉన్న మెటల్‌ బాల్స్‌  ఖేడా జిల్లాలోని ఉమ్రేత్, నాడియాడ్ గ్రామాలతోపాటు ఆనంద్ జిల్లాలోని మూడు గ్రామాలలో పడినట్లుగా గుర్తించారు. 





‘మదర్స్ డే’లాగా భార్యల దినోత్సవం కచ్చితంగా ఉండాలట! ఎందుకో చెప్పిన కేంద్ర మంత్రి


ఆనంద్‌ జిల్లాలోని భలేజ్, ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో ఆకాశం నుంచి మిస్టీరియస్ శిథిలాలు రాలి పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. భలేజ్‌ ప్రాంతంలో గురువారం సాయంత్రం 4.45 గంటలకు ఐదు కేజీల బరువున్న నల్ల రంగులోని మెటల్‌ బాల్‌ పడింది. ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో కూడా ఇలాంటివి ఆకాశం నుంచి పడ్డాయి. ఈ మూడు గ్రామాలు 15 కిలోమీటర్ల పరిధిలో పక్కపక్కనే ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందుతూండటంతో పోలీసులు వాటిని సేకరించారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. 


బాలుడి పెదాలపై ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం లైంగిక నేరమా? : బాంబే హైకోర్టు సంచలన తీర్పు


అవి నిజంగానే పై నుంచి ఊడిపడ్డాయని... శాటిలైట్‌ వ్యర్థాలుగా వారు బావిస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులను పిలిపించినట్లు వాటిని పరిశీలిస్తున్నారు. అయితే  రాకెట్ ప్రయో సమయంలో ఉపయోగించే అధిక సాంద్రత కలిగిన లోహాలతో తయారు చేసినట్టు భావిస్తున్నారు. వీటి వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. అయితే బరువుగా ఉన్న అవి మనుషుల మీద పడితే తీవ్రంగా గాయపడటం ఖాయమని నమ్ముతున్నారు.  అంతరిక్ష వ్యర్థాలను పరిశీలించేందుకు ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ  రంగంలోకి దిగింది. దేశ అంతరిక్ష డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఈ ప్రభుత్వ లాబొరేటరీ, స్పేస్ సైన్స్‌పై పరిశోధనలు చేస్తుంది.


ఒక్క క్లాస్‌ రూమ్‌లో ఒకే సారి రెండు తరగతులకు పాఠాలు చెప్పడం చూశారా ? బీహార్ నుంచి చూపిస్తున్నాం చూడండి