ABP  WhatsApp

Russia Ukraine War: ఎటెళ్లాలో తెలియడం లేదు, ఎటు చూసినా బాంబు పేలుళ్లే- ఖార్కివ్‌లో విద్యార్థుల ఆవేదన

ABP Desam Updated at: 01 Mar 2022 05:24 PM (IST)
Edited By: Murali Krishna

Russia Ukraine War: ఉక్రెయిన్‌ ఖార్కివ్‌ పేలుడులో ఓ భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ప్రాంతంలో భారత విద్యార్థులు 30 మంది వరకు చిక్కుకున్నారు. అక్కడి పరిస్థితిని ఓ విద్యార్థి ఏబీపీకి వివరించాడు.

ఖార్కివ్‌లో విద్యార్థుల ఆవేదన

NEXT PREV

Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంలో కర్ణాటకకు చెందిన నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఖార్కివ్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య జరిగిన పేలుళ్లలో నవీన్ చనిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే ఆ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి భారత విద్యార్థులు ఎటెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. భారత ఎంబసీ కూడా వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ABP దేశంతో అజయ్ అనే ఓ విద్యార్థి అక్కడి పరిస్థితుల గురించి వివరించాడు.


పడిగాపులు


రష్యా భీకర దాడులు చేస్తోన్నందున్న భారత విద్యార్థులంతా పశ్చిమ వైపునకు వెళ్లాలని భారత ఎంబసీ సూచించింది. దీంతో అజయ్ సహా 20-30 మంది విద్యార్థులు.. ఖార్కివ్ నగరానికి మంగళవారం ఉదయమే చేరుకున్నారు. అయితే ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలనే దానిపై వారికి ఎంబసీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదు.



మేం ఉదయం 9.30 గంటల నుంచి రైల్వేస్టేషన్‌లో పడిగాపులు కాస్తున్నాం. అసలు ఏ రైలు ఎక్కాలి అనేది కూడా తెలియడం లేదు. ఏ ట్రైన్ ఏ ప్లాట్‌ఫాంకు వస్తుందో కూడా చెప్పడం లేదు. ఇక్కడంతా గందరగోళంగా ఉంది. భారత ఎంబసీ కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎటు చూసినా బాంబు పేలుళ్లు, తుపాకీ తూటాల శబ్దాలతో మార్మోగుతోంది.                                                -   ABP దేశంతో అజయ్, ఎంబీబీఎస్ విద్యార్థి


 దాడికి దగ్గర్లోనే


ఖార్కివ్‌ పేలుడు జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే తాము ఉన్నట్లు అజయ్ తెలిపాడు. తమ పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. భారత ఎంబసీ అధికారులు వెంటనే తమకు సాయం చేయాలని కోరాడు. ఈ విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వీరిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.


విద్యార్థి మృతి


ఖార్కివ్ పేలుడులో మృతి చెందిన విద్యార్థి కర్ణాటక హవేరి జిల్లాకు చెందిన నవీన్​ జ్ఞానగౌడార్​గా గుర్తించారు. నవీన్ ఉక్రెయిన్‌లో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. 


Also Read: Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి- భారత విదేశాంగ శాఖ ప్రకటన


Also Read: Ukraine Russia War: ఈయూ దేశాలపై పుతిన్ ప్రతీకారం- రష్యా గగనతలంలోకి ఆ దేశ విమానాలు వస్తే!

Published at: 01 Mar 2022 05:18 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.