పాస్‌పోర్టు రావడం సులువే కానీ ఏదైనా దేశానికి వెళ్లేందుకు వీసా రావడం మాత్రం కాస్త కష్టం. కొన్నిసార్లు వీసా రిజెక్ట్ అవుతుంది కూడా. వేసవి సెలవులకి ఇతర దేశాలకి  ఫ్యామిలీ టూర్ లేదా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి వీసా కష్టాలు అడ్డుగా ఉంటాయి.  ఎలాంటి వీసా లేకుండా టూరిస్టులను ఆహ్వానించే దేశాలు ఉన్నాయి. అందులోను ప్రత్యేకంగా భారతీయులకు కొన్ని దేశాలు వీసా ఫ్రీ విజిట్‌ను అందిస్తున్నాయి. దాదాపు 60 దేశాలు కేవలం ఇండియన్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా తమ దేశాల్లోని ఆహ్వానిస్తున్నాయి. అందులో కొన్ని అందమైన దేశాలు ఇవిగో...


ఒమన్
ఒమన్ చారిత్రక కట్టడాలతో కూడిన ప్రాచీన మధ్యప్రాచ్య దేశం. మస్కట్, వహిబా సాండ్, రాస్ అల్ జింజ్, నిజవా, ముసండం ఫ్జోర్డ్స్... ఇవన్నీ పర్యాటకులు, చరిత్రకారులకు ఎంతో నచ్చే స్థలాలు. వీటిని చూడటానికే వెళ్లేవారు చాలా ఎక్కువ. ఈ దేశానికి ఇండియన్ పాస్‌పోర్టుతో హాలీడే కు వెళ్లి రావచ్చు. 


థాయిలాండ్
ఆసియాలోని పర్యాటకులకు అత్యంత అందమైన గమ్యస్థానం థాయిలాండ్. బీచ్‌లు, వరి పొలాలు, నేషనల్ పార్కులు, దీవులు, స్పాలు... ఎన్నో ప్రత్యేకమైన అనుభవాలు దొరుకుతాయిక్కడ. ఈ దేశానికి కూడా వీసా లేకుండా సందర్శించి రావచ్చు. 


శ్రీలంక
మన పొరుగు దేశం శ్రీలంక భారతీయులకు బ్రహ్మరథం పడుతుంది. వీసా లేకుండా ఎన్నిసార్లయిన వెళ్లిరావచ్చు. బీచ్‌లు, పురాతన దేవాలయాలు, తేయాకు తోటలు, కేవ్ టెంపుల్స్ చూసి రావచ్చు. 


మారిషస్
ద్వీపదేశం మారిషస్. హిందూమహాసముద్రతలాలపై తేలుతున్న అందమైన ద్వీపం ఈ చిన్నదేశం.చుట్టూ నీళ్లతో చాలా ఆహ్లాదకరంగా ఉండే ఈ దేశం కూడా భారతీయులను వీసా అడగదు. 


మాల్దీవులు
పరిచయం అవసరం లేని దేశం మాల్టీవులు. హనీమూన్‌లకు స్వర్గధామంలాంటిది ఈ దేశం. ఎన్నో ప్రైవేటు ద్వీపాలతో నిండిన మాల్దీవులు పగడపు దిబ్బలతో, సహజమైన అందాలతో మెరిసిపోతూ ఉంటుంంది. 


లావోస్
సౌతీస్ట్ ఆసియాలోని ఒక ప్రశాంతమైన చిన్న దేశం లావోస్.  ప్రకృతి సౌందర్యతో నిండి ఉంటుంది ఈ దేశం. ఎన్నో సాహసోపేత క్రీడలకు లావోస్ కేంద్రబిందువు. స్నేహితులతో ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు. 


ఫిజి
వీసాలేకుండా భారతీయ పాస్‌పోర్టుతో ప్రయాణించగల మరొక అందమైన బీచ్ దేశం ఫిజి. ఇది  ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలాంటిది. దాదాపు 300 ద్వీపాలు ఇందులో ఉంటాయి. తాబేలు ద్వీపం, గ్రేట్ ఆస్ట్రోలేబ్ రీఫ్, సావా ఇ లౌ గుహలు చూసేందుకు చాలా బావుంటాయి. 



Also read: శివరాత్రి పర్వదినాన ఉపవాసం చేస్తున్నారా? ఈ ఆరోగ్య జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే


Also read: హైబీపీని సహజంగా తగ్గించే ఆహారాలివి, తింటే ఎంతో మేలు