రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతీకార చర్యలు చేపట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడులకు ప్రతిగా తమ దేశంపై ఈయూ ఆంక్షలు విధంచడంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 36 దేశాల విమానాలపై బ్యాన్ విధించారు. ఈ దేశాలకు చెందిన విమానాలు తమ గగనతలం నుంచి వెళ్లకుండా రష్యా నిషేధం విధించింది.


ఈయూకు దెబ్బ


ఈ నిర్ణయంతో ముఖ్యంగా ఐరోపా దేశాలకు తీవ్ర నష్టం కలగనుంది. రష్యా నిషేధం విధించిన 36 దేశాల జాబితాలో బ్రిటన్, జర్మనీ, ఇటలీ, కెనడా, స్పెయిన్ వంటి ఐరోపా దేశాలు ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ దేశాల తీరుకు ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టిన్నట్లు రష్యా విమాన యాన సంస్థ ప్రకటించింది.


టికెట్ ఛార్జీల మోత


ఈ కారణంగా ప్రజలకు ప్రయాణ దూరం, చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే యూర్‌పలోని అత్యధిక దేశాలతో పాటు, కెనడా గగనతలంలో ప్రవేశానికి రష్యా విమానాలకు అనుమతి లేదు. ఇందుకు ప్రతిగా ప్రస్తుతం రష్యా గగనతలంలోకి ప్రత్యేక అనుమతి ఉన్న విమానాలనే అనుమతిస్తున్నారు.


రష్యాపై వేటు


ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు గత వారం రష్యా విమాన సర్వీసులను ఈయూ దేశాలు రద్దు చేశాయి. దీనికి దీటుగా రష్యా కూడా ఆ దేశాల నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని నిర్ణయించింది. 







ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం పశ్చిమ దేశాలు, రష్యా మధ్య ఆంక్షలను పెంచుతున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాలలో జర్మనీ, ఫ్రాన్ వంటి దేశాలతో పాటు బ్రిటన్, అమెరికా, కెనడా, జపాన్ వంటి దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే రష్యాకు సంబంధించిన నాలుగు బ్యాంకులపై చర్యలు తీసుకున్నాయి. తమ గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలను నిషేధించాయి. 


మరోవైపు బెలారస్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. బెలారస్ రష్యాకు సహరిస్తుందని అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈయూ దేశాలు కూడా బెలారస్‌పై ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి.



Also Read: Russia Ukraine War: భారత విద్యార్థులారా కీవ్ నగరం నుంచి వెంటనే బయలుదేరండి: భారత ఎంబసీ