Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి- భారత విదేశాంగ శాఖ ప్రకటన
ఉక్రెయిన్‌లో జరుగుతోన్న దాడులలో భారత విద్యార్థి మృతి చెందాడు.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న భీకర దాడుల్లో భారత విద్యార్థి మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన నవీన్ అనే విద్యార్థి ఈ దాడుల్లో మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఖార్కివ్ నగరంలో ఈ రోజు రష్యా సైన్యం భీకర దాడులతో విరుచుకుపడింది. నిత్యావసరాల కోసం దుకాణానికి వెళ్లిన సమయంలో సైనిక దళాల షెల్లింగ్‌లో నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, భారత విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది.
కీవ్ నగరమే టార్గెట్
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా సేనలు వేగంగా కదులుతున్నాయి. ఓ భారీ సాయుధ కాన్వాయ్ కీవ్ వైపు వెళ్తోన్న ఉపగ్రహ చిత్రాలు ఈరోజు సోషల్ మీడియాలో కనిపించాయి. దీని పొడవు 65 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ నగరాల్లో ఈ ఉదయం నుంచి ఎయిర్ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఖార్కివ్ నగరంలో రష్యా సైనికులు కాల్పుల మోత మోగిస్తున్నారు. ఈ కాల్పుల్లోనే నవీన్ మృతి చెందినట్లు తెలుస్తోంది.