నాటో కూటమిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటోలో చేరబోమని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన జెలెన్‌స్కీ తాజాగా ఆ కూటమిపై విమర్శలు చేశారు.
చర్చలు విఫలం
యుద్ధం నిలిపేసే అవకాశాలపై ఉక్రెయిన్, రష్యా మధ్య ఫిబ్రవరి 28 నుంచి ప్రతినిధుల స్థాయిలో మూడుసార్లు బెలారస్‌లో చర్చలు జరిగాయి. మార్చి 14న ఉభయ పక్షాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాలుగో రౌండ్ చర్చలు జరిపాయి. కానీ ఈ చర్చల్లో యుద్ధం నిలిపివేసేలా ఎలాంటి పురోగతి రాలేదు. రాబోయే రోజుల్లో పుతిన్‌తో జెలెన్‌స్కీ సంభాషణలు జరిపే అవకాశాలున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ గత వారం తెలిపారు.
సాయం కోరిన జెలెన్‌స్కీ
అమెరికా తమకు తక్షణ సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ ఆ దేశ కాంగ్రెస్ (సభ)ను ఇటీవల కోరారు. అమెరికా కాంగ్రెస్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెలెన్‌స్కీ మాట్లాడారు. ఈ ప్రసంగంలో పెర్ల్ హర్బర్, 9/11 ఉగ్రదాడిని ప్రస్తావించారు. తమ సార్వభౌమత్వాన్ని రష్యా సవాల్ చేస్తుందని జెలెన్‌స్కీ అన్నారు.
" రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు అమెరికా కాంగ్రెస్ మరిన్ని చర్యలు తీసుకోవాలి. మా దేశ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని మేం ఎప్పటి నుంచో కోరుతున్నాం. కానీ ఇది నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ మా కోసం అమెరికా తక్షణ చర్యలు చేపట్టాలి. రష్యన్ చట్టసభ్యులపై ఆంక్షలు విధించాలి. దిగుమతులను నిలిపేయాలి. రష్యా దురాక్రమణను ఆపకపోతే మా జీవితాలు వ్యర్థం. "
Also Read: PM Narendra Modi: రోజుకు 2 గంటలే మోదీ నిద్రపోతున్నారట- ఎందుకో తెలుసా?
Also Read: Russia Ukraine War: రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ వణుకుతోంది: బైడెన్