PM Narendra Modi: రోజుకు 2 గంటలే మోదీ నిద్రపోతున్నారట- ఎందుకో తెలుసా?

ప్రతి రోజూ మోదీ కేవలం 2 గంటలే నిద్రపోతున్నారని మహారాష్ట్ర భాజపా చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అన్నారు.

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీ.. రోజుకు కేవలం 2 గంటలే నిద్రపోతున్నారట! ఇది ఎవరో అనుకుంటున్నమాట కాదు.. సాక్షాత్ మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చంద్రకాంత్ పాటిల్ అన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ఆయన ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

Continues below advertisement

ప్రధాని మోదీ రోజూ రెండు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఆయన నిద్రపోకుండా ఓ ప్రయోగం చేస్తున్నారు. దేశం కోసం 24 గంటలు పనిచేయాలని తపిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ 22 గంటల పాటు ప్రధాని పని చేస్తున్నారు.                                                       -  చంద్రకాంత్ పాటిల్, మహారాష్ట్ర భాజపా చీఫ్

ఇటీవల కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు భాజపా కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రతిరోజులు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని ఆయన అన్నారు. నిద్ర పోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రధాని ప్రతి నిమిషం దేశం కోసం పరితపిస్తూ పనిచేస్తున్నారని పాటిల్ అన్నారు. 24 గంటలూ మెలకువగా ఉండి దేశం కోసం పని చేసేలా నిద్రను అదుపు చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారట!

4 గంటలు

ప్రధాని మోదీ తన నిద్ర గురించి ఓసారి బహిరంగంగానే చెప్పారు. 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ వెబినార్‌లో మోదీ పాల్గొన్నారు. ఇందులో కొంతమమంది మోదీని పలు ప్రశ్నలు అడిగారు. అందులో ఒకరు.. మోదీని మీరు ఎన్ని గంటలు నిద్రపోతారు అని అడిగారు. దీంతో మోదీ ఆసక్తికర సమాధానం చెప్పారు.

నేను తక్కువ సమయమే నిద్రపోతాను. నిజానికి నా స్నేహితులు, వైద్యులు చాలా మంది రోజుకు 5-6 గంటల పాటు నిద్రపోవాలని నాకు సలాహాలు ఇచ్చారు. కానీ నేను 3-4 గంటలు మాత్రమే నిద్రపోతాను. ఎన్నో ఏళ్లుగా ఇది నాకు అలావాటైంది.                                                  - నరేంద్ర మోదీ

Also Read: Russia Ukraine War: రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ వణుకుతోంది: బైడెన్

Also Read: Watch Video : 125 ఏళ్ల యోగా లెజెండ్ స్వామి శివానందపై నెటిజన్లు ప్రశంసలు, పద్మ శ్రీ అందుకున్న తీరుకు ఫిదా!

Continues below advertisement