Russia Ukraine Conflict: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టడం ఇరు దేశాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఓ వైపు ఉక్రెయిన్‌లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంటే.. మరోవైపు రష్యా దేశ స్టాక్ మార్కెట్ మరియు రూబుల్ భారీగా పతనమవుతోంది. దీంతో రష్యా కుబేరుల కోట్ల సంపద ఆవిరి అవుతోంది. పుతిన్ యుద్ధ నిర్ణయంతో రష్యా బిలియనీర్లు తలలు పట్టుకుంటున్నారు.
కుబేరులతో పుతిన్ కీలక భేటీ
క్రెమ్లిన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో టాప్ బిజినెస్ పర్సనాలిటీస్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది కచ్చితంగా అవసరమైన చర్య. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నామని కనీసం 13 మంది బిలియనీర్లతో భేటీలో అధ్యక్షు పుతిన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. కానీ వ్యాపార దిగ్గజాలు మాత్రం పుతిన్‌కు కనీసం తమ సమస్యను కూడా చెప్పడానికి నోరు మెదపలేదట.
రష్యా కుబేరులకు భారీ నష్టం
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఫిబ్రవరి 16న ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి రష్యా సిద్ధమైనప్పటి నుంచి నేటి వరకు 116 మంది రష్యా బిలియనీర్లు 126 బిలియన్ల డాలర్ల (Russian billionaires pay the price of Putin's war lose)కు పైగా నష్టపోయారు. రష్యాకు చెందిన మోక్స్ ఇండెక్స్ 33 శాతం పతనం కాగా, డాలర్‌తో పోలిస్తే రూబుల్ రికార్డు స్థాయికి పడిపోయింది. ఒక్క గురువారం మార్కెట్లోనే 71 బిలియన్ల డాలర్ల సంపద ఆవిరైందని నివేదిక పేర్కొంది. అత్యధికంగా నష్టపోయిన ఐదుగురు రష్యా కుబేరులలో అలెక్‌పెరోవ్, మిఖెల్సన్, మొర్దాషోవ్, పొటానిన్, కెరిమోవ్ ఉన్నారు. రష్యా బిలియనీర్లలో కనీసం 11 మంది గురువారం ఒక్కరోజు మార్కెట్లోనే ప్రతి ఒక్కరు 1 కంటే ఎక్కువ బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయారు.
గత వారం రష్యా అధ్యక్షుడు పుతిన్ మాజీ అల్లుడు (మాజీ బిలియనీర్) కిరిల్ షమలోవ్‌తో పాటు అనేక మంది బిలియనీర్లకు బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల మొదలైన తర్వాత, రష్యా బ్యాంకులు రష్యా కుబేరుల బ్యాంకు ఖాతాలను తాత్కాలికంగా స్తంభింపజేస్తున్నట్లు ప్రకటించింది. యూకే బ్యాంక్ ఖాతాల్లో $66,000 (50,000 పౌండ్లు) కంటే ఎక్కువ ఉండకుండా రష్యా వ్యాపారులపై ఆంక్షలు విధించినట్లు రిపోర్ట్ చేశారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ విదేశాలకు సైతం రష్యాపై పరోక్షంగా యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. బ్యాంకింక్ చెల్లింపులైన స్విఫ్ట్ విధానంలో రష్యాను తొలగించి కఠిన నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రీమియర్ లీగ్ సాకర్ టీమ్ చెల్సియా ఎఫ్‌సీ ఓనర్, రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ ఆస్తులను సైతం సీజ్ చేయాలని బ్రిటన్ చట్టసభ సభ్యులు ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సూచించారు. అబ్రమోవిచ్‌తో పాటు మరికొందరు రష్యా బిలియనర్లపై ఆంక్షలు విధించాలని, బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసి ఆర్థికంగా ఇరుకున పెట్టాలని నేతలు భావిస్తున్నారని యూకే విదేశాంగశాఖ కార్యదర్శి లిజ్ ట్రూస్ ఎల్‌బీసీ రేడియోకు తెలిపారు.
Also Read: Russia Ukraine Crisis: బుకారెస్ట్ నుంచి భారత్‌కు చేరుకున్న మరో 249 మంది, ఆపరేషన్ గంగ మరో సక్సెస్
Also Read: Russia-Ukraine Crisis: 'అణ్వాయుధాలు రెడీ చేయండి'- మరో బాంబు పేల్చిన పుతిన్, అంతా హైటెన్షన్