అమెరికాలోని కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. ఈ విధ్వంసంలో 50 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉందని కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ చెప్పారు. టోర్నడో చాలా ప్రాంతాలను నాశనం చేస్తుందని అన్నారు. కెంటుకీలోని అనేక ప్రాంతాలు.. ధ్వంసమయ్యాయని తెలిపారు. రాష్ట్రానికి 200 మైళ్ల దూరంలో టోర్నడో ఉందని గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు.
'50 మందికి పైగా చనిపోయారని నేను అనుకుంటున్నాను. బహుశా 70 లేదా 100 మంది వరకు ఉండొచ్చు. కెంటకీ రాష్ట్ర చరిత్రలో ఇది వినాశకరమైనది. తీవ్రమైన టోర్నడో ఇంది' అని గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు.
మేఫీల్డ్ నగరంలోని కొవ్వొత్తుల కర్మాగారంలో పైకప్పు కూలిపోవడంతో మరణాలు సంభవించాయని.. గవర్నర్ చెప్పారు. ప్రస్తుతం కెంటకీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
కెంటకీ రాష్ట్రంలోనే కాదు.. యూఎస్ లోని అనేక రాష్ట్రాల్లో టోర్నడో బీభత్సం సృష్టిస్తోంది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అమెజాన్ కు సంబంధించిన గిడ్డంగిపైనా శుక్రవారం సాయంత్రం టోర్నడో ఎఫెక్ట్ పడింది. 100 మంది కార్మికులు లోపల చిక్కుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఉద్యోగులను రక్షించడానికి అధికారులు శనివారం కూడా పని చేశారని వెల్లడించింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో టోర్నడో ఎఫెక్ట్ కు సంబంధించి.. హెచ్చరిక అమలులో ఉంది. అయితే ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా.. వారికి ఏమైంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
'ఇల్లినాయిస్ స్టేట్ పోలీస్ మరియు ఇల్లినాయిస్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ రెండూ స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ పని చేస్తున్నాయి. ఎప్పటికప్పుడూ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నాం' అని గవర్నర్ జేబీ ప్రిట్జర్ చెప్పారు.
'మా ఉద్యోగులు భద్రత మరియు శ్రేయస్సు ప్రస్తుతం మా మొదటి ప్రాధాన్యత. మేము పరిస్థితిని అంచనా వేస్తున్నాం. పూర్తి సమాచారం తెలిసినప్పుడు చెబుతాం.' అని అమెజాన్ ప్రతినిధి రిచర్డ్ రోచా పేర్కొన్నారు.
Also Read: నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్
Also Read: World Chess Champion: ఐదోసారి వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా కార్లసన్
Also Read: Employee Blow Up Warehouse: బాస్‌పై కోపంతో ఆఫీస్‌ను తగలబెట్టేసిన ఉద్యోగిని.. కోట్లలో నష్టం!
Also Read: Railways: అరే ఏంట్రా ఇది...పెరుగు కోసం రైలు ఆపేశారు... వీడియో వైరల్ లోకో పైలట్ సస్పెండ్