ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా మాగ్నస్‌ కార్లసన్ మరోసారి నిలిచాడు. దుబాయ్‌లో జరిగిన ఫిడే చెస్‌ ఛాంపియన్‌ షిప్‌లో సత్తా చాటి ఐదోసారి చెస్ రారాజుగా నిలిచాడు. 

ఫిడే వరల్డ్‌ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో రష్యా ఆటగాడితో తలపడ్డాడీ చెస్‌ రారాజు. ఇయాన్‌ నెపోనియాచీతో తలపడిన మ్యాచ్‌లో అద్భుతమైన విజయం సాధించి తనకు తిరుగులేదని చాటాడు. 7.5-3.5 తేడాతో ఇంకో మూడు గేమ్‌లు మిగిలి ఉండగానే ఆధిపత్యం చూపి ఛాంపియన్‌గా నిలిచాడు కార్లసన్. ఆఖరి వరకు చాలా ఉత్కంఠతో సాగిందీ టోర్నీ. చివరి మ్యాచ్‌ కూడా అదే మజా ఇచ్చింది. ప్రత్యర్థి చేసిన తప్పులను తనకు అనుకూలంగా మలుచుకొని జయభేరీ మోగించాడీ వరల్డ్ ఛాంపియన్. 23వ ఎత్తులో నెపోనియా చేసిన తప్పిదాన్ని అనుకూలంగా మార్చుకొని 49 ఎత్తుల్లో గేమ్‌ క్లోజ్ చేసేశాడు కార్లసన్. మెగా టోర్నీల్లో రెండోసారి నల్లపావులతో బరిలోకి దిగిన ఈ చెస్‌ దిగ్గజం... నాలుగో విజయాన్ని తన అకౌంట్‌లో వేసుకున్నాడు. టోర్నీలో మొదట్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన కార్లసన్‌ క్రమంగా పుంజుకున్నాడు. తొలి ఐదు గేమ్‌లను డ్రాగా ముగించాడు. తర్వాత నుంచి గేర్ మార్చి ఛాంపియన్ అయ్యాడు. కార్లసన్ తన కేరీర్‌లో ఐదోసారి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. నాలుగోసారి తన టైటిల్ నిబెట్టుకున్నాడు. తొలిసారిగా 2013లో భారత్‌ చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌పై విజయం సాధించాడు కార్లసన్. 

Also Read: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!

Also Read: Hardik Pandya Test Retirement: హార్దిక్‌ పాండ్య సంచలన నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు యోచనలో ఆల్‌రౌండర్‌!

Also Read: ICC Test Rankings: మయాంక్‌ దూకుడు..! 10 వికెట్ల అజాజ్‌ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!

Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?

Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఆ స్టార్ ఆటగాడు దూరం.. వీరిద్దరికీ లక్కీ చాన్స్!

Also Read: Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!

Also Read: Team India Announced: రోహిత్‌కు ప్రమోషన్.. పరిమిత ఓవర్లకు పూర్తిస్థాయి కెప్టెన్.. కింగ్ కోహ్లీ టెస్టుల వరకే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి