Pakistani family of beggars spent PKR 1 Croe 50 Lakhs for grand celebration with 20 000 guests : పాకిస్తాన్ ప్రభుత్వం ఏడాదిలో 365 రోజులూ దివాలా అంచున ఉంటుంది. సౌదీ అరేబియాకో .. మరో దేశానికో పోయి నెలకోసారి అప్పు తెచ్చుకోకపోతే పూటగడవదు. అలా తీసుకొచ్చిన అప్పుతో అక్కడి పాలకులు జల్సాలు చేస్తారు . ప్రభుత్వాన్ని చూసి అక్కడి ప్రజలు కూడా ఆలాగే తయారవుతున్నారు. ముష్టి అడుక్కునే వాళ్లు కూడా ఓ రేంజ్ లో జల్సాలు చేస్తున్నారు. తాజాగా గుజ్రాన్ వాలాలోని ఓ ముష్టి ఫ్యామిలీ తమ ఇంట్లో ఫంక్షన్ కోసం ఏకంగా కోటిన్నర మేర ఖర్చు చేశారు.
Also Read: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
గుజ్రాన్‌వాలాలో ముష్ఠెత్తుకుని బతికే ఓ ఫ్యామిలీ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు ఇరవై వేల మంది గెస్టులు హాజరయ్యారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు.వారందరికీ మంచి మంసాహార విందు ఏర్పాటు చేశారు.ఇందు కోసం కోటిన్నర పాకిస్తాన్ రూపాయల ఖర్చు అయిందని లోకల్ మీడియా ప్రకటించింది. ఇంతకీ ఇది ఏమి ఫంక్షన్ అంటే... ఆ బెగ్గర్స్ ఫ్యామిలీలో కుటంబపెద్ద అయిన మహిళ చనిపోయారట. అందుకే ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
Also Read; టెలిగ్రామ్ సీఈవో రియల్ విక్కీ డోనర్ - స్పెర్మ్ ఇచ్చి ఉచితంగా ఐవీఎఫ్ చేయిస్తాడట - ఒకటే కండిషన్
గెస్టులు రావడానికి, వెళ్లడానికి రెండు వేల వాహనాలు ఏర్పాటు చేశారు. ఇంత చేసి ఈ విందు ఎక్కడ ఏర్పాటు చేశారంటే రైల్వే స్టేషన్‌లో. బెగ్గర్స్ ఫ్యామిలీలో జరిగిన ఈ పంక్షన్ గురించి సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది. చాలా మంది ఆ బెగ్గర్స్ ఫ్యామిలీ గురించి తమకు తెలుసని గుజ్రాన్ వాలాలో చాలా మంది కన్నా వారు చాలా రిచ్ అని చెబుతూ వస్తున్నారు.
పాకిస్తాన్ ప్రజల జీవన ప్రమాణాలు పెద్దగా మెరుగపడటం లేదు. అక్కడ ఎవరూ విదేశీ పెట్టుబడులు పెట్టరు. లోకల్ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు తక్కువ. ఫలితంగా ప్రజల ఆర్థిక సామర్థ్యం పెరగడం లేదు. కానీ కష్టపడేేవారికి ఒకటే ఇల్లు.. అడుక్కునే వాడికి అరవై ఇళ్లు అన్నట్లుగా బెగ్గర్స్ మాత్రం రిచ్ గా మారుతున్నారు. తమ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర ప్రజల్ని అబ్బుర పరుస్తున్నారు.