Telegram CEO Pavel Durov offers his sperm and IVF treatment for free:   కొన్నాళ్ల క్రితం విక్కీ డోనర్ అనే హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో స్పెర్మ్ డొనేట్ చేస్తూంటాడు. అయితే డబ్బులకు ఆ పని చేస్తూంటాడు. మిగతా కథ అంతా ఏమయిందన్నది పక్కన పెడితే ఇలాంటి విక్కీ డోనర్లు చాలా చోట్ల ఉంటారు. కానీ ఎవరూ బహిరంగంగా చెప్పరు. కానీ టెలిగ్రాం యాప్ సీఈవో పావెల్ దురోవ్ మాత్రం ఇలాంటి మొహమాటలకు అతీతం. ఆయన అన్నీ చెబుతారు. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు.                 


ట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?


తన స్పెర్మ్‌తో పిల్లలు పుట్టించుకోవాలని అనుకుంటున్న ఎవరికైనా సరే డొనేట్ చేస్తానని .. అదే సమయంలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా ఉచితమేనని ప్రకటించారు. అయితే ఇందు కోసం రష్యా రావాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. పావెల్ దురోవ్ రష్యాలోనే నివాసం ఉంటుంది . అ దేశం నుంచి బయటకు వస్తే ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. టెలిగ్రాం యాప్ విషయంలో ఆయన అనేక రకాల చట్టాలను ఉల్లంఘించారని ఇతర దేశాలు కేసులు పెట్టాయి.                      


పావెల్ దురోవ్ ఇలా స్పెర్మ్ డొనేట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. తనకు యుక్త వయసు వచ్చినప్పటి నుచి స్పెర్మ్ డొనేట్ చేస్తున్నానని ఆయన చెబుతున్నారు. పద్దెనిమిదేళ్ల క్రితం స్పెర్మ్ సమస్యల వల్ల తన మిత్రుడు ఒకరు పిల్లలు కనలేని పరిస్థితికి  వస్తే.. తన సాయం అడిగారని అప్పట్నుంచి తాను స్పెర్మ్ డొనేట్ చేస్తున్నానని అంటున్నారు.  ఆ లెక్కన ఇప్పటికి తనకు వంద మంది పిల్లలు ఉంటారని అంటున్నారు. వారెవరో ఆయనకు తెలుసో లేదో స్పష్టత లేదు. ఇప్పుడు రష్యాలోని ఫెర్టిలిటీ క్లినిక్ అల్ట్రావిటా ద్వారా ఈ ఆఫర్ ఇచ్చారు.  ఈ క్లినిక్ తన వెబ్ సైట్‌లో ఈ ఆఫర్ ను ప్రకటించింది.                                                


రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్


రష్యా ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. ప్రజల్ని పిల్లలను కనేలా చేయాడనికి అక్కడి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. శృంగార మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. పిల్లలు పుట్టడానికి అన్ని అవకాశాలున్న మహిళల గురించి సర్వే నిర్వహిస్తున్నారు. పావెల్ దురోవ్ వంటి వారి స్పెర్మ్ తో అయినా పిల్లలు పుట్టించడానికి కొంత మంది ముందుకు వస్తారని ఆశపడుతున్నారు. రెండు పెళ్లిళ్ల ద్వారా పావెల్ దురోవ్ ఇప్పటికే ఐదుగురు పిల్లలను సొంతంగా కన్నారు.