ట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?

Continues below advertisement

అమెరికా ఎలక్షన్స్‌లో ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే మస్క్ మొదటి నుంచి ట్రంప్ కే సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలా ఎలన్ మస్క్ హ్యాపీగా ఉంటే.. ఆయన కూతురు వివియన్‌ జెన్నా విల్సన్‌ మాత్రం సాడ్‌గా ఉంది. అసలు అమెరికాలో తన ఫ్యూచర్ ఏంటో తెలియట్లేదని.. అంతా అగమ్య గోచరంగా మారిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ చేసింది. నేను కొన్నాళ్లుగా భయపడుతున్నది.. నిన్న వాస్తవరూపంలోకి వచ్చింది. అమెరికాలో ఉంటే నాకు ఎటువంటి భవిష్యత్తు కనిపించడం లేదని ఆ పోస్ట్ లో రాసింది. ఇంతకీ ఎందుకింతగా ఆమె భయపడుతుందంటే.. అమెరికాలో లింగమార్పిడి నిబంధనల గురించి. ట్రంప్ అధికారంలోకి వస్తే లింగ మార్పిడి నిబంధనలు కఠినతరం అవుతాయని ఆమె ఆందోళన చెందుతుంది.

అయితే, ఆమె అమెరికాను వీడుతుందన్న పోస్టు గురించి మస్క్‌ కూడా స్పందించారు. ‘నా కుమారుడిని ఓక్‌ మైండ్‌సెట్‌ చంపేసింది’ అని మరోసారి పునరుద్ఘాటించారు. దీనిపై జెన్నా స్పందిస్తూ.. తన తండ్రి ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను థ్రెడ్‌లో పోస్టు చేసింది.  అసలు విషయం ఏంటంటే.. ఎలాన్‌ మస్క్‌ ఫస్ట్ భార్యకు పుట్టిన పిల్లల్లో జస్టిన్‌ విల్సన్‌ అనే పురుషుడు ఉన్నాడు. ఇతను 2022లో లింగమార్పిడి చేయించుకొని తన పేరును వివియన్‌ జెన్నా విల్సన్‌గా మార్చుకున్నాడు. మస్క్‌కు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో లింగమార్పిడి చేసుకున్న ఆమె తన తండ్రికి దూరంగా ఉంటోంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram