Prime Minister Modi will visit three countries from November 16: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  నవంబర్‌ 16 నుంచి 21 వరకూ మూడు దేశాల్లో పర్యటించనున్నారు.  నైజీరియా, బ్రెజిల్తో పాటు గయానా దేశాల్లో పర్యటిస్తారు.  నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్‌ టినుబు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్తున్నారు.    16 – 17 తేదీల్లో నైజీరియాలో పర్యటిస్తారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.  పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. నైజీరిలో భారతీయులు పలు రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపారాల్లోనూ ఉన్నారు. 


రియో డి జనీరోలో జీ 20 సమావేశానికి హాజరు కానున్న ప్రధాని మోదీ 


నైజీరియా పర్యటన తర్వాత బ్రెజిల్ వెళ్తారు. నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్‌లోని రియోడిజనీరో నగరంలో   జీ-20 సదస్సు జరుగుతుంది. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొంటారు. జీ 20 సదస్సును భారత్ గత ఏడాది ఘనంగా నిర్వహించింది. అప్పుడే ఈ ఏడాది నిర్వహించే అవకాశాన్ని బ్రెజిల్ కు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇచ్చారు.  బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో లులా డా సిల్వా ఆధ్వర్యంలో నిర్వహించే G20 సమ్మిట్‌ కు ప్రపంచ దేశాలకు చెందిన కీలక నేతలు హాజరవుతున్నారు.     


 


Also Read: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా ?


జీ 20 సమ్మిట్‌లో పలు దేశాలతో కీలక సమావేశాలు                             


జీ 20 సమ్మిట్ లో పలు దేశాలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ఇందు కోసం విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. జీ 20 సమావేశం తర్వాత రియో నుంచి ప్రధాని మోదీ గయానాకు వెళ్తారు.  తమ దేశంలో పర్యటించాలని గయానా అధ్యక్షుడు మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ  చాలా కాలంగా ఆహ్వానిస్తున్నారు. వెస్టిండీస్ దీవుల్లో ఒకటి అయిన గయానాలో భారత ప్రధానమంత్రి ఎవరూ గత యాభై ఆరు ఏళ్లలో పర్యటించలేదు. ప్రధాని మోదీ గయానా పార్లమెంట్‌లోనూ ప్రసంగిస్తారు.  భారతీయ ప్రవాసుల సమావేశంలోనూ మోదీ ప్రసంగిస్తారు.  రెండవ CARICOM-ఇండియా సమ్మిట్‌లో కూడా మోదీ పాల్గొంటారు. 




Also Read: గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్




ప్రధాని మోదీ ప్రపంచంతో భారత్ సంబంధాల మెరుగుదల కోసం నిరంతరం శ్రమిస్తూంటారు. ఆయన అనేక దేశాల్లో తరచూ పర్యటిస్తూంటారు. ఆయా దేశాల్లో ప్రవాస భారతీయులతో సమావేశం అవుతూ ఉంటారు. గయానా వంటి దేశాలకూ వెళ్తున్న ఆయన..  తన పదవీ కాలంలో భారత ప్రధానిగా అత్యధిక దేశాల్లో పర్యటించిన రికార్డు సృష్టించే అవకాశం ఉంది.