Meghasandesam  Serial Today Episode:   నరేన్‌ ను పట్టుకున్న గగన్‌, చెర్రిలు చితక్కొడతారు. నిజం చెప్పమని అడుగుతారు. దీంతో నరేన్‌ నిజం చెప్తానని అంటాడు. నాకేం తెలియదని.. చెప్తాను అంటూ ఇంట్లోంచి పారిపోతాడు. చెర్రి వెనకాలే పరుగెడతాడు. గగన్‌ అక్కడే నిలబడి వంశీని చూస్తుంటాడు. వాళ్ల నాన్న దగ్గరకు వచ్చి మీరందరూ అపార్థం చేసుకున్నట్టు మా చెల్లి చెడ్డదా..? అంటూ గగన్‌ ఎమషన్‌ అవుతాడు. మీ ముందే వాడు ఫోన్‌ లో మాట్లాడటం మీరు కూడా విన్నారు. కదా..? అంటూ వంశీకి సారీ చెప్తాడు. వంశీ కూడా గగన్‌కు సారీ చెప్పి వాడు ఆలా మాట్లాడేసరికి పెళ్లి పెటాకులు అయిపోయింది అంటాడు. దీంతో గగన్‌ ఈ పెళ్లి వల్ల రెండు ప్రాణాలు నిలబడతాయని చెప్తాడు. ఇంతలో అక్కడికి చెర్రి వస్తాడు. వాడు తప్పించుకున్నాడని చెప్తాడు. అందరూ కలిసి హాస్పిటల్ కు వెళ్తారు. మరోవైపు శారద భయం భయంగా చూస్తుంటే.. రౌడీలు వచ్చి బెదిరిస్తారు.

రౌడీ: ఏంటి పారిపోదామని చూస్తున్నావా..? అది అంత సులభం కాదు. నీ కొడుకు రాడని ఫిక్స్‌ అయ్యావా..? పొరపాటున వస్తే ఈ చేతులో వాడి కంఠం నలిపి నీ కళ్ల ముందే వాడి ప్రాణం తీస్తా.. మా సార్‌ చెప్పాడు కాబట్టి నీ మీద మా నీడ కూడా పడలేదు.

అని బెదిరించడంతో శారద ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. మరోవైపు శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అపూర్వ వస్తుంది.

అపూర్వ: బావ నిన్నటి నుంచి నువ్వేమి తినలేదు. తాగలేదు. కనీసం ఈ జ్యూస్‌ అయినా తాగు బావ

శరత్‌: వద్దు అపూర్వ..

చెర్రి ఫోన్‌ చేస్తాడు.

శరత్‌: ఆ చెర్రి చెప్పరా..?

చెర్రి: గుడ్ న్యూస్‌ మామయ్య ఇందు పెళ్లి చెడగొట్టిన వాణ్ని పట్టుకున్నాము. అన్నయ్య చాలా తెలివిగా వాణ్ని వంశీ వాళ్ల ఇంట్లోకే పరుగెత్తేలా చేశాడు. ఆ తర్వాత

 అంటూ జరిగింది చెప్తాడు చెర్రి. పక్కనే ఉన్న అపూర్వ, సుజాత భయంతో చెర్రి మాటలు వింటారు. ఇంతలో శరత్ చంద్ర ఎవరా మేడం అని అడుగుతాడు.

చెర్రి: అది తెలిసుకునే లోపే వాడు తప్పించుకున్నాడు మామయ్యా. మేము అందరం ఇప్పుడు హాస్పిటల్ కే వెళ్తున్నాం. అన్నయ్య అనుకున్న టైంకు దగ్గరుండి ఇందు మెడలో తాళి కట్టిస్తారు. రౌడీలకు ఫోన్‌ చేసి కొంచెం పెద్దమ్మను వదిలేయమని చెప్పు మామయ్య.

శరత్‌: చెప్పనురా..

చెర్రి: అలా అంటే ఎలా మామయ్యా..

శరత్‌: చూడు ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. ఇందు పెళ్లి జరిగింది అని కన్‌ఫం అయిన తర్వతనే శారదను వదలమని చెప్తాను. ఇది ఫైనల్.

అని ఫోన్‌ కట్‌ చేస్తాడు. ఏమైందని గగన్‌ అడుగుతాడు. మామయ్య మాట వినడం లేదని పెళ్లి అయ్యాకే పెద్దమ్మను వదిలేస్తానని చెప్పాడు అని చెప్తాడు. దీంతో  వాడు ఆ పెళ్లి చేయకుండా చూడాలని అపూర్వ అనుకుంటుంది. మరోవైపు వంశీ వాళ్లను తీసుకుని హాస్పిటల్ కు వస్తారు.  జరిగిందంతా చెర్రి చెప్తాడు. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

గగన్‌: త్వరగా పెళ్లి చేసేయండి.

బామ్మ: పెళ్లా ఇక్కడా..?

వంశీ డాడీ: అమ్మాయి తప్పు లేదు అని తెలిశాక ఇంకా ఆలోచించాలా..?

సౌందర్య: ఖర్చు పెట్టి అదంతా చేసాం. ఇప్పుడు అమ్మాయిని మా ఇంటి కోడలిని చేసుకుంటాం.

చెర్రి: ఇదంతా అన్నయ్య చేశారు నాన్నా..

గగన్‌: అరేయ్‌ చెర్రి ఇప్పుడు ఇదంతా ఎందుకు త్వరగా పెళ్లి చేయించండి.

అని గగన్‌ అనగానే  ప్రసాద్‌ అసలు ఏం జరిగింది అని అడుగుతాడు.  చెర్రి జరిగింది చెప్తాడు. ఇంతలో వంశీ చేత ఇందుకు తాళి కట్టిస్తాడు గగన్‌. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!