Prema Entha Madhuram  Serial Today Episode:  షాపింగ్‌ కు వచ్చిన చిన్నొడు, పెద్దొడు. అక్కడే ఉన్న శంకర్‌ చూసి అవమానిస్తారు. ఇంత ఖరీదైన బట్టలు కొనాలనుకుంటున్నావా..? మమ్మల్ని బయటకు గెంటివేశావు కదా..? అందుకే డబ్బులు మిగిలి ఉంటాయి. కొనాలనుకుంటున్నాడేమో అంటూ మాట్లాడతారు. రేంజ్‌ లేని వాళ్లు ఇక్కడికి వస్తారని తెలిస్తే.. మనం ఇక్కడికి వచ్చే వాళ్లమే కాదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడికి అకి వింటున్న నాకే ఇంత కోపంగా ఉంటే మీరేంటి నవ్వుతున్నారు. అంటూ గౌరిగారికి ఈవిషయం చెప్పాలి అని గౌరి దగ్గరకు వెళ్లి శంకర్‌ వాళ్ల తమ్ముళ్లు వచ్చి శంకర్‌ గారిని అవమానించి వెళ్లారు. అని చెప్పగానే గౌరి వాళ్లను తిడుతూ శంకర్‌ దగ్గరకు వెళ్తుంది. మరోవైపు చిన్నొడు, పెద్దొడు, శ్రావణి, సంధ్యలను చూస్తారు. మాట్లాడటానికి వెళ్తారు. శంకర్‌ దగ్గరకు వెళ్లిన గౌరి శంకర్‌ ను ఓదారుస్తుంది.


గౌరి: శంకర్‌ గారు నాకు తెలసు మీ మనసు బాగా నొచ్చుకుని ఉంటుంది. కానీ బాధపడకండి. వాళ్లేదో అన్నంత మాత్రాన మీరేం తక్కువ అయిపోరు. రేపోమాపో మీ కాళ్ల దగ్గరకు వస్తారు. వాళ్లకు రెండు తగిలించాల్సింది.


శంకర్‌: ఏంటి నా తమ్ముళ్లను కొట్టాలా..?


గౌరి: మిమ్మల్ని నానా మాటలు అన్నారని అకి చెప్పింది. కోపం రాలేదా..? మీకు


శంకర్‌: సరిపోయింది. అకి నా కోసం ఈ డ్రెస్‌ సెలెక్ట్ చేసి ట్రయల్‌ చేయమంది. ఈలోపు వాళ్లు ఎదురొచ్చారు. సూటుబూటులో ఎంత అందంగా ఉన్నారో తెలుసా..?


గౌరి: మిమ్మల్ని ఓదార్చడానికి వస్తే.. మీరేం మీ తమ్ముళ్లు కనబడ్డారని తెగ సంతోషంగా ఉన్నారు.


శంకర్: మీరు ఏదేదో ఊహించుకుని వచ్చి అది జరగకపోయే సరికి నా మీద అరుస్తారేంటి.?


గౌరి: మరీ బాధ లేకపోతే ఇక్కడెందుకు నిల్చున్నారు.


శంకర్‌: ట్రైయల్‌ రూం ఖాళీ లేదండి. అందుకే ఇక్కడ నిల్చున్నాను.


అని శంకర్ చెప్పగానే గౌరి మీకో దండం అని వెళ్లిపోతుంది.  మరోవైపు చిన్నొడు, పెద్దొడు వెళ్లి శ్రావణి, సంధ్యలను పలకరిస్తారు. వాళ్లను శ్రావణి, సంధ్య తిడతారు. చిన్నప్పటి నుంచి పెంచి మిమ్మల్ని చదివించిన అన్నయ్యనే మోసం చేసినోళ్లు మిమ్మల్ని నమ్మి మీ జీవితాల్లోకి ఎలా రావాలని ప్రశ్నిస్తారు. మరోవైపు చీరలు చూస్తున్న గౌరి దగ్గరకు అకి వెళ్తుంది. ఇంతలో శ్రావణి, సంధ్య వస్తారు. శంకర్‌ ట్రైయల్‌ రూంలోంచి డ్రెస్‌ వేసుకుని రావడం చూసి అందరూ షాక్‌ అవుతారు.


శంకర్: ఏంటిఅందరూ అలా షాకై చూస్తున్నారు. బాగాలేదా..? తీసేయన్నా..


అకి: సూపర్ గా ఉంది నాన్నా… (అందరూ షాక్‌ అవుతారు.) సూపర్ గా ఉంటుందని అన్నాను కదా..? చాలా అంటే చాలా బాగున్నారు.


శ్రావణి: శంకర్ గారు మీరు ఈ డ్రెస్‌ లో మోడల్‌ గా ఉన్నారండి.


సంధ్య: ట్రెండీగా ట్రెడిషనల్‌ గా భలే ఉన్నారు.


అకి: సంధ్య, శ్రావణి ఆఫీసు వేర్‌ కు ఆ బ్లాక్‌ లో ఉంటాయి. చూద్దాం పదండి నేను కూడా తీసుకోవాలి.


అని ముగ్గురు వెళ్లిపోతారు.


శంకర్‌: హలో గౌరి గారు మీకు నచ్చలేదు కదా..? అయినా మీకు నచ్చినా నచ్చలేదనే చెప్తారులేండి. నేను హండ్సమ్‌ గా ఉంటే మీకు కుల్లు


గౌరి: చాలా బాగున్నారు….?


శంకర్‌: అయ్య బాబోయ్‌.. మీరేనా మీరేనా ఈ మాట అంటుంది. ఇది కలా నిజమా.. అసలు నేను ఎక్కడున్నాను.


గౌరి: శంకర్ గారు మరీ ఓవర్‌ చేయకండి. నేనేం మీలా ప్రతిదానికి ఎగతాళి చేయలేదు. బాగుంటే బాగుందని చెప్తాను.


శంకర్‌: మీరు ఇలా కాంప్లిమెంట్ ఇస్తుంటే నమ్మలేకపోతున్ననండి. ఏది మరోసారి చెప్పండి. ఎలా ఉన్నాను.


గౌరి: రాజులకే రాజులా దర్జాగా.. చూడగానే ఆకర్షించేలా.. చాలా హూందాగా ఉన్నారు. మీ అందం ఏంటో తెలుసా…? మీ మనసు. మీ మనసుకు కల్మషం ఉండదు. అందుకే మీరు కూడా చాలా ప్యూర్ గా కనిపిస్తారు. మిమ్మల్ని చూస్తే చాలు ఎవరికైనా మన అనిపిస్తుంది. సొంత మనిషిలా అనిపిస్తారు.


శంకర్‌: గౌరి గారు మీరు ఒకేరోజు ఇన్ని పొగడ్తలు పొగుడుతుంటే తట్టుకోలేను. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను


అని శంకర్ వెళ్లిపోతాడు. మరోవైపు అకికి జెండే ఫోన్‌ చేస్తాడు. జెండేకు షాపులో జరిగిన విషయాలు చెప్తుంది. శంకర్‌ ను తమ్ముళ్లు తిట్టారని తెలిసి కోప్పడతాడు. అకి, జెండేతో మాట్లాడటం వెనక నుంచి విన్న గౌరి, శంకర్‌ ఎందుకు మమ్మల్ని అమ్మా నాన్న అంటున్నావు అని అడుగుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!