Khalistan group holds referendum in Auckland: భారత్‌లో చిచ్చు పెట్టేందుకు ఖలిస్థాన్ సపోర్టర్లు కెనడా నుంచి చేసే కుట్రలకు ఆ దేశం అండగా నిలబడుతోంది. అక్కడి ప్రధాని ట్రూడో రాజకీయ లక్ష్యం కోసం ఖలిస్థానీ సపోర్టర్లకు మద్దతుగా ఉంటున్నారు. ఇందు కోసం మన దేశంతో ఉద్రిక్తతలు సృష్టించుకునేందుకు కూడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా న్యూజిలాండ్ కూడా కెనడా బాటలో పయనించేందుకు సిద్దమవుతోంది.
తాజాగా న్యూజిలాండ్‌లోని ప్రముఖ పట్టణం అయిన ఆక్లాండ్‌లో ఖలిస్తాన్ సపోర్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖలిస్థాన్ కు మద్దతుగా వారు ప్రజాభిప్రాయసేకరణ చేశారు. అసలు భారత్ లో చిచ్చు పెట్టేందుకు న్యూజిలాండ్‌లో ప్రజాభిప్రాయసేకరణ చేయడమే కమెడీ అనుకుంటే.. తమ దేశంలో స్వేచ్చ ఉందని న్యూజిలాండ్ అధికార వర్గాలు ప్రకటించి..అనుమతి ఇవ్వడం మరింత వివాదాస్పదం అయింది. భారీ ర్యాలీ నిర్వహించిన ఖలిస్థాన్ సపోర్టర్లు ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించి ఖలిస్థాన్‌కు ప్రజల మద్దతు ఉందని ప్రకటించుకున్నారు.
Also Read : కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
అయితే న్యూజిలాండ్‌తో సిక్కులతో పాటు కొన్ని లక్షల మంది ఇతర వర్గాలకు చెందిన భారతీయులు కూడా స్థిరపడ్డారు. వారంతా ఆక్లాండ్ అధికారుల తీరును తప్పు పట్టారు. ఇలా ఇతర దేశాల ఆంతరంగిక విషయాల్లో జోక్యంచేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. భారత్‌లో ఖలిస్థాన్ మద్దతుదారుల్ని టెర్రరిస్టులుగా ప్రకటించారు. ఈ కారణంగా భారత్ ను గౌరవించే దేశాలు..ఖలిస్తాన్ సపోర్టర్లకు మద్దతుగా ఉండవు.కానీ కొన్ని దేశాలు మాత్రం.. భారత్ కు వ్యతిరేకంగా వెళ్తున్నాయి.
న్యూజిలాండ్ వ్యవహారశైలిని భారత్ నిశితంగా గమనిస్తోంది. కెనడాలో ఇప్పటికే ఖలిస్తానీ సపోర్టర్లు చేసిన,చేస్తున్న అల్లర్లు.. వాటికి కెనడా ప్రభుత్వం అండగా ఉంటున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఈ క్రమంలో ఖలీస్థాన్ వివాదాన్ని న్యూజిలాండ్ కు విస్తరించడం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం మరింత ముదరకముందే ...ఖలిస్థాన్ సపోర్టర్లకు మద్దతుగా ఉండే దేశాలకు మన దేశం హెచ్చరికలు జారీ చేయాల్సిందన్ అభిప్రాయం వినిపిస్తోంది.
భారత్‌లో ఒక్కరు కూడా ఓ ఖలిస్థానీ డిమాండ్ వినిపించరు. అసలు ఖలిస్తాన్ అనే భావజాలమే లేదు. కానీ ఇతర దేశాల్లో స్థిరపడిన వారు ఆయా దేశాల పౌరసత్వం కలిగిన వారు మాత్రమే మన దేశంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఆయా దేశాల ప్రభుత్వాలు మద్దతుగా నిలుస్తూండటంతో దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా ఏర్పడుతున్నాయి. వారి దేశాల అంతర్గత విషయాల్లో బారత్ జోయ్కం చేసుకుంటే ఎలా ఉంటుందో .. భారత్ విషయంలోనూ అలాగే ఉండటం లేదు. అక్కడే సమస్యలు వస్తున్నాయి.