Top Headlines In AP And Telangana:


1. ఏపీ హైకోర్టులో ఆర్జీవీకి బిగ్ షాక్


సోషల్ మీడియాలోపోస్టుపై పెట్టిన కేసు కొట్టేయాలని లేదా విచారణకు సమయం ఇవ్వాలన్న ఆర్జీవీ అభ్యర్థనను ఏపీహైకోర్టు కొట్టేసింది. పోలీసులతోనే తేల్చుకోవాలని సూచించింది. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టులో షాక్ తగిలింది. తనపై నమోదు అయిన కేసులు కొట్టేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై గతంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆయనపై ఈ మధ్యే కేసు నమోదు అయింది. రేపు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇంకా చదవండి.


2. ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్


ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదో షాకింగ్ న్యూస్‌ అనే చెప్పవచ్చు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో డీఎస్సీ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వర్గీకరణ ఈ నోటిఫికేషన్ నుంచే అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తితో దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్ వేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని చూస్తోంది. అందుకే ఆలస్యమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేశారు. ఇంకా చదవండి.


3. లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నియోజకవర్గం కొడంగల్‌(Kodangal)లోని లగచర్ల దాడి ఘటన కేసు మరింత తీవ్రం అవుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఏ 1గా ఉన్న పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ 2గా ఉన్న సురేష్ మాత్రం ఇంత వరకు ఆచూకీ లేదు. అందుకే అతని వెతికి పట్టుకునేందుకు పోలీసులు లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నప్పటికీ ఇంత వరకు సురేష్(Suresh) ఆచూకీ లభించకపోవడంపై పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంకా చదవండి.


4. తెలంగాణ కొత్త ఈవీ పాలసీలో ఏముంది.?


తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-2030 పేరుతో కాలుష్య నియంత్రణ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ప్రమాదాల నివారణ, కాలుష్య నియంత్రణకు ఈ విధానం తెచ్చింది. జీవో నెంబర్‌ 41 ద్వారా తీసుకొచ్చే ఈ విధానం 2026 వరకు అమల్లో ఉంటుంది. తెలంగాణను కాలుష్యరహితంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి భారీగా రాయితీలు ఇస్తోంది. ఇంకా చదవండి.


5. ఆ వివరాలు వెల్లడించకుంటే రూ.10 లక్షలు ఫైన్


మదింపు సంవత్సరం 2024-25 (Assessment Year 2024-25 లేదా AY 2024-25) కోసం ఆదాయ పన్ను పత్రాలు (Income Tax Return) సమర్పించిన వారికి, ఆదాయ పన్ను విభాగం ఓ హెచ్చరిక జారీ చేసింది. పన్ను చెల్లింపుదారు, తనకు విదేశాల్లో ఉన్న ఆస్తులు, విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని ITRలో వెల్లడించకుంటే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని వార్నింగ్‌ ఇచ్చింది. నల్లధన నిరోధక చట్టం ప్రకారం రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు. ఆలస్యంగా & సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31 అని కూడా గుర్తు చేసింది. ఇంకా చదవండి.