Victoria Kjaer Theilvig Won Miss Universe 2024: ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో మిస్ యూనివర్స్‌కు ఉన్న క్రేజే వేరు. తాజాగా జరిగిన పోటీల్లో డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ (Kjaer Theilvig) గెలుపొంది విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. దాదాపు 125 మంది పోటీల్లో పాల్గొన్నారు. మెక్సికో వేదికగా జరిగిన పోటీల్లో 125 మంది పోటీ పడగా.. 21 ఏళ్ల విక్టోరియా కెజార్ కిరీటం అందుకున్నారు. మిస్ యూనివర్స్ 73వ ఎడిషన్ పోటీల్లో విజేతగా నిలిచిన విక్టోరియాకు 2023 మిస్ యూనివర్స్ షెన్నిస్ పలాసియోస్ విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించింది. నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, మెక్సికో చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్.. మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. 'కొత్త శకం మొదలైంది. 73వ విశ్వ సుందరిగా గెలుపొందినందుకు అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాం.' అని మిస్ యూనివర్స్ టీమ్ పేర్కొంది. ఆమెకు ఫ్యాషన్ ప్రియులు అభినందనలు తెలిపారు. మరోవైపు, ఈ పోటీల్లో భారత్ తరఫున రియా సింఘా పాల్గొన్నారు. టాప్ 5లోనూ ఆమె నిలవలేకపోయారు.
తొలి డెన్మార్క్ భామగా..
విశ్వ సుందరి కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామగా విక్టోరియా అరుదైన ఘనత సాధించారు. 2004లో సోబోర్గ్‌లో జన్మించిన ఆమె బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పొంది వ్యాపారవేత్తగా మారారు. డ్యాన్సులోనూ శిక్షణ తీసుకున్నారు. మానసిక ఆరోగ్యం, మూగజీవాల సంరక్షణ వంటి విషయాలపై పోరాటం చేస్తున్నారు. అందాల పోటీల్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో మోడలింగ్ రంగంలోకి వచ్చారు. మిస్ డెన్మార్క్‌గా తొలిసారి విజయాన్ని అందుకున్నారు. 2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20లో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు.