పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానిని ఎన్నుకునేందుకు నేషనల్ అసెంబ్లీ సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి పీటీఐ సభ్యులందరూ వాకౌట్ చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఎవరంటే?
మూడుసార్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్ 2017లో పదవీచ్యుతుడయ్యారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు.
ఐదు పెళ్లిళ్లు
షెహబాజ్ 1951 సెప్టెంబరు నెలలో లాహోర్‌లో జన్మించారు. షెహబాజ్ తండ్రి ముహమ్మద్ షరీఫ్ స్వస్థలం కశ్మీర్ (భారత్)లోని అనంతనాగ్. ఆయన పారిశ్రామికవేత్త. షెహబాజ్ లాహోర్‌లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
షెహబాజ్ అయిదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు భార్యలు. మిగతా ముగ్గురికి విడాకులిచ్చారు.షెహబాజ్ పెద్ద కుమారుడు హమ్జా పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సీఎం ఎన్నికల బరిలో నిలిచారు. బ్రిటన్‌లో 1,400 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సంబంధించి నగదు అక్రమ చలామణి కేసు షెహబాజ్‌పై ఉంది.
Also Read: Gujarat News: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు- ఆరుగురు కార్మికులు మృతి
Also Read: Jharkhand Ropeway Accident: రోప్‌వేలో కేబుల్ కార్లు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి- చిక్కుకుపోయిన 42 మంది