NASA James Webb Jupiter Image: 'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్ ఇంటర్వెల్‌కు ముందు 'ఇక మొదలుపెడదామా' అని డైలాగ్ చెబుతాడు. అప్పటివరకూ స్లో గా సాగుతున్న సినిమాలో ఒక్కసారిగా ఊపు వస్తుంది. సేమ్ అలానే ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా చెలరేగిపోతోంది.
కొద్దిరోజుల క్రితం వరకూ అడ్జస్ట్ మెంట్స్ అండ్ క్యాలిబరేషన్ కోసం టైం తీసుకున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ జులై 12న ఈ ప్రపంచం అప్పటివరకూ చూడని ఐదు కలర్ ఫుల్ ఇమేజెస్‌ను విడుదల చేసింది. వాటిని డీటైల్ గా శాస్త్రవేత్తలు ఎనలాసిస్ చేస్తున్న టైం లోనే ఇప్పుడు మళ్లీ సోలార్ సిస్టమ్ లోని ఆబ్జెక్ట్స్ ఫోటోలను తీసింది నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్.
జ్యూపిటర్
సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహమైన జ్యూపిటర్‌ను నాసా వెబ్ టెలిస్కోప్ ట్రాక్ చేసింది. అనంతమైన విశ్వంపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సన్నద్ధమయ్యే ప్రోసెస్ లో శాస్త్రవేత్తలు అసలు జేమ్స్ వెబ్ తో సోలార్ సిస్టమ్ లో ఆబ్జెక్ట్స్ ఎలా కనిపిస్తున్నాయో చూడాలని ఈ ఫోటోలు తీశారు. ఇన్ ఫ్రారెడ్ రేస్ ఉపయోగించటం వలన బృహస్పతి తో పాటు పక్కనే దాని చందమామ యూరోపాను కూడా గుర్తించగలిగారు నాసా సైంటిస్టులు. బట్ ఇంజినీరింగ్ పర్పెసెస్ కోసమే తీసిన ఈ ఇమేజెస్ ను ప్రోసెస్ చేయకుండా రా ఫుటేజ్ నే పబ్లిక్ డొమైన్ లో పెట్టింది నాసా.
మరొకటి కూడా
జ్యూపిటర్, యూరోపా తో పాటు ఆ గ్రహం పరిధి దాటుకుని దూసుకు వస్తున్న ఆస్టరాయిడ్ 6481 టెన్సింగ్ ను కూడా గుర్తించింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దీనికి సంబంధించిన ఫుటేజ్ ను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది నాసా. ఇంతే కాదు నాసా జేమ్స్ వెబ్ ఉన్న లరాంజే పాయింట్ భూమి నుంచి దాదాపు పదిలక్షల మైళ్ల దూరం ఉంటుంది. కానీ ఇంత దూరం ఉన్నా జేమ్స్ వెబ్ నుంచి డేటా భూమికి రావటానికి కేవలం ఐదుసెకన్లు మాత్రమే పడుతోందని ఆపరేషన్స్ సెంటర్ ప్రకటించింది.
సోలార్ ఆబ్జెక్ట్స్ ను ఇంత క్లియర్ గా జేమ్స్ వెబ్ గుర్తించగలిగితే..మార్స్ మీద రాక్స్ ను, సోలార్ సిస్టమ్ అవతల ఉన్న ఎక్సో ప్లానెట్స్ మీద వాటర్ ను కూడా చాలా ఈజీగా వెబ్ స్పెస్ టెలిస్కోప్ గుర్తించగలదని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు.
Also Read: James Webb Telescope : విశ్వం గుట్టు వీడుతోందా? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఫస్ట్ ఫొటోలు ఏం చెబుతున్నాయ్!
Also Read: James Webb Space Telescope Image: విశ్వం రహస్యం ఇదే- నాసా జేమ్స్ వెబ్ తీసిన తొలి ఫొటో విడుదల!