James Webb Telescope : నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తొలి ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(NASA) మంగళవారం విడుదల చేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ లతో కలిసి నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా సేకరించిన తొలి ఫొటోలను విడుదల చేశారు. వీటితో స్పెస్ట్రో స్కోపిక్ డేటా తో ఉండే ఫుల్ కలర్ ఇమేజెస్ ద్వారా ఈ విశ్వంలో అంతుచిక్కని రహస్యాలుగా ఉండిపోయిన ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే జేమ్స్ వెబ్ తన ఫస్ట్ ఫోటోలను ఐదు కాస్మిక్ ఆబ్జెక్స్ ను టార్గెట్ చేసి తీసింది. 


1. Southern Ring Nebula


భూమి నుంచి రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ సదరన్ రింగ్ నెబ్యూలానే ఎయిట్ బరస్ట్ నెబ్యులా అని కూడా అంటారు.  ఓ మృత నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ ప్లానెట్ విపరీతంగా తన గ్యాస్ క్లౌడ్స్ ను ఎక్స్ పాండ్ చేస్తూ వెళ్తోంది. 



2. Stephans Quintet 


ఇది చాలా చాలా పాత గెలాక్సీ గ్రూప్. 1877 లో దీన్ని మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పెగాసస్ కన్ స్టలేషన్ లో ఉండే ఈ స్టీఫెన్ క్వింటెట్ భూమిని నుంచి 290 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. వాస్తవానికి ఇవి మొత్తం ఐదు గెలాక్సీల సముహమైనా స్టీఫెన్ క్వింటెట్ మధ్యలో మిగిలిన నాలుగు గెలాక్సీలు ఇరుక్కుపోవటం చాలా విచిత్రంగా అనిపిస్తోంది.



3.Carina Nebula


మనకు కనిపించే విజిబుల్ స్పేస్ లో మనకు తెలిసిన అతిపెద్ద, ప్రకాశవంతమైన నెబ్యులా కేరీనా నే. సదరన్ కెరీనా కన్ స్టలేషన్ కు 7 వేల 600 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఈ కేరీనా నెబ్యూలా ను తొలి ఫొటోగా తీసింది నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నెబ్యూలా అంటే ఔటర్ స్పేస్ లో ఉండే క్లౌడ్ ఆఫ్ గ్యాస్ గానీ డస్ట్ గానీ అన్న మాట. ఇప్పుడు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగ ఎలా కనిపిస్తుందో ఏ నెబ్యులాలు కూడా అలా అంతరిక్షంలో మెరుస్తూ ఉంటాయి. ఇంకో థియరీ ఏంటంటే ఈ నెబ్యులాల్లోనే స్టార్ట్స్ తయారవుతాయి. సూర్యుడి కంటే పెద్దవైన ఎన్నో స్టార్స్ కి ఈ కెరీనా నెబ్యూలా నే స్థావరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 



4. WASP-96 b (spectrum)


WASP 96 b అనేది మన సౌర కుటుంబానికి బయట ఉన్న అతిపెద్ద ప్లానెట్. ఈ ప్లానెట్ మొత్తం గ్యాస్ తోనే నిండిపోయి ఉంటుంది.  భూమి నుంచి ఒక వెయ్యి 150 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే WASP 96b దాని నక్షత్రం చుట్టూ తిరగటానికి మూడు రోజుల నాలుగు గంటల సమయం పడుతుంది. మన జ్యూపిటర్ మాస్ లో సగం ఉండే ఈ గ్రహాన్ని 2014లో మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 



5. SMACS 0723


SMACS 0723 అనేది ఓ మ్యాసివ్ ఫోర్ గ్రౌండ్ గెలాక్సీ క్లస్టర్ అన్న మాట. దీన్ని మ్యాగ్నిఫై చేసి అసలు దీనిలోపల ఏముందో చెక్ చేసి ఫోటోలు తీసేలా నాసా జేమ్స్ వెబ్ దృష్టి సారించింది. వాస్తవానికి ఇది చాలా దూరంలో ఉన్న ఫెయింట్ గెలాక్సీ పాపులేషన్స్ లో ఒకటైనప్పటికీ కూడా జేమ్స్ వెబ్ సత్తా ఏంటో చాటేందుకే దీని ఫోటోను విడుదల చేశారు నాసా శాస్త్రవేత్తలు. 



విశ్వం గుట్టు ఛేదించేందుకు అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధనా సంస్థలు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు రూపొందించాయి. 2021 డిసెంబర్‌ 25న ఫ్రెంచ్‌ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ టెలిస్కోప్ ను అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న హబుల్‌ టెలిస్కోప్‌ స్థానంలో జేడబ్ల్యూఎస్‌టీని ప్రవేశపెట్టారు. జేమ్స్ వెబ్ టెలిస్కోపుతో శాస్త్రవేత్తలు విశ్వం పుట్టుక, రహస్యం, నక్షత్రాలు వంటి పలు అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.