Ranil Wickremesinghe: తీవ్ర నిరనసల మధ్య శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద అభయ్‌వర్దన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా విక్రమ సింఘే నిర్వర్తించనున్నారు.
నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు స్పీకర్ తెలిపారు. శ్రీలంక పార్లమెంటు సమావేశాలు శనివారం ప్రారంభమవుతాయి.
మరోవైపు
గొటబాయ రాజపక్స, ఆయన సతీమణి, వారి వెంట ఇద్దరు భద్రతా సిబ్బంది సైనిక విమానంలో మాల్దీవులకు వెళ్లినట్లు శ్రీలంక వైమానిక దళం బుధవారం ప్రకటించింది. బుధవారం వేకువజామున 3 గంటలకు గొటబాయ.. శ్రీలంక నుంచి మాల్దీవులకు పరారయ్యారు. అయితే అక్కడ కూడా గొటబాయకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీంతో గొటబాయ రాజపక్స సింగపూర్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మాల్దీవుల నుంచి సౌదీ అరేబియా వయా సింగపూర్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Mohammed Zubair Gets Bail: జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌కు రిలీఫ్- బెయిల్ మంజూరు
Also Read: RS Secretariat New Rules: ఇక పార్లమెంటు ఆవరణలో ధర్నా, నిరసనలకు నో- ఉత్తర్వులు జారీ చేసిన మోదీ!