RS Secretariat New Rules: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మరో కీలక నిర్ణయం వెలువడింది. పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలకు ఇక అనుమతి లేదంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ విమర్శలు
రాజ్యసభ కార్యదర్శి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు చేశారు. "ఇది విశ్వగురు కొత్త నాటకమని, ధర్నా మనా హై" అంటూ జైరాం తన ట్విట్టర్‌లో ఆరోపించారు.
లోక్‌సభ స్పీకర్
ఇటీవల కొన్ని పదాలను పార్లమెంట్‌లో వాడరాదని వచ్చిన వార్తలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొట్టిపారేశారు. వాటిని నిషేధించలేదని కానీ ఆయా పదాలను అవసరాన్ని బట్టి రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు.
Also Read: NIRF Ranking 2022 List: ఉత్తమ విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్- యూనివర్సిటీల్లో బెంగళూరు టాప్
Also Read: Nupur Sharma Remarks Row: అజ్మేర్ దర్గా ఖాదీమ్ సయ్యద్ చిస్తీ హైదరాబాద్‌లో అరెస్ట్