Just In
Trump vs Elon Musk: 'మస్క్‌ను మోకాళ్లపై నిలబడి అడుక్కోమనాల్సింది' - ట్రంప్ కౌంటర్ మామూలుగా లేదు!
Trump vs Elon Musk: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా టెస్లా సీఈఓ మస్క్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Trump vs Elon Musk: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఇక రాజకీయాల నుంచి రిటైర్ కావాలని మస్క్ చేసిన వ్యాఖ్యలపై డొనాల్డ్.. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో వీరిద్దరూ దిగిన ఫొటోను కూడా ట్రంప్ షేర్ చేశారు.
మస్క్ రియాక్షన్
అయితే ఈ కౌంటర్‌కు మస్క్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ట్రంప్ పోస్ట్‌ను ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేయగా దానికి మస్క్ స్పందిస్తూ కార్టూన్ క్యారెక్టర్ గ్రాండ్‌పా సిమ్సన్ అరుస్తున్నట్లుగా ఉన్న జిఫ్ ఇమేజ్‌ను పోస్ట్ చేస్తూ మాజీ అధ్యక్షుడికి వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు.
Also Read: Madras High Court: మంగళసూత్రం తీసేయడం మానసిక క్రూరత్వం- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Also Read: Corona Cases: దేశంలో వరుసగా రెండో రోజూ 20 వేల కేసులు- పెరిగిన మృతుల సంఖ్య