Corona Cases: దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది. కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. 47 మంది మృతి చెందారు. తాజాగా 16,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉన్నాయి.
- డైలీ పాజిటివిటీ రేటు: 4.44 శాతం
- మొత్తం మరణాలు:5,25,604
- యాక్టివ్ కేసులు: 1,39,073
- మొత్తం రికవరీలు: 4,30,45350
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 18,92,969 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,47,34,994కు చేరింది. మరో 4,50,820 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కేంద్రం ఆదేశాలు
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
Also Read: Viral Photo : ఎద్దుల భారాన్ని తగ్గించిన ఐడియా - ఇప్పుడిదే సోషల్ మీడియా ట్రెండింగ్!
Also Read: Boxer Succumbs To Punch: కుప్పకూలిన బాక్సర్- రెండు రోజులకు మృతి, షాకింగ్ వీడియో!