Boxer Succumbs To Punch: బాక్సింగ్ మ్యాచ్.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. బాక్సింగ్ మ్యాచ్‌లో ప్రత్యర్థి విసిరిన పంచ్‌కు కుప్పకూలిన యువకుడు రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. కర్ణాటకలో జరిగింది ఈ ఘటన.


ఇదీ జరిగింది


బెంగళూరు నగరభావి ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. రాష్ట్రస్థాయి కిక్​ బాక్సింగ్​ మ్యాచ్​ ఆడుతుండగా.. నిఖిల్ (23) తలకు తీవ్ర గాయమైంది. అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.






కోమాలోకి వెళ్లిపోయిన నిఖిల్​కు చికిత్స అందించినా ప్రయోజనం లేకుండాపోయింది. రెండు రోజుల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. మైసూరులో బుధవారం నిఖిల్​ మృతదేహానికి అతని తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ బాక్సింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఫిర్యాదు






అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మ్యాచ్ నిర్వహించడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని మృతుడు నిఖిల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిఖిల్ మృతిపై ఎమ్‌ఎమ్‌ఏ ఫైటర్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.


Also Read: Congress On Parliament Session: అగ్నిపథ్, ఎల్‌పీజీ ధరల పెరుగుదల- పార్లమెంటులో కాంగ్రెస్ ఆయుధాలు ఇవే!


Also Read: Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు పరుగో పరుగు- సింగపూర్‌ నుంచి సౌదీ చెక్కేసిన రాజపక్స!