Rolling sport fitted on a bullock cart :  బండెనక బండి కట్టి అని మనలో పాడుకోని వారు ఉండరు. ఇప్పటికీ గ్రామాల్లో ఎద్దుల బండ్లే రవాణాలో కీలకం. ఎద్దులు అంత భారం తమ మెడపై ఎలా మోస్తున్నాయో అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే అనాదిగా అంతే ఉంది కాబట్టి కొత్తగా ఏమీ చేయలేమని ఊరుకున్నారు. అయితే అందరూ అలా ఊరుకోలేరుగా.. కొంత మంది యువకులు వినూత్న ఆలోచన చేశారు. ఎద్దుల  భారాన్ని తగ్గించడానికి మూడో చక్రం అమర్చారు.  ఇప్పుడు ఎద్దుల బండి ఎలా ఉందో మీరే చూడండి. 





ఈ ఐడియా చాలా మందిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేయగానే అలా వైరల్ అయిపోయింది. అయితే ఈ క్రియేషన్ ఎవరు చేశారో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ఎవరికి వారు ఇతరులకు క్రెడిట్ ఇవ్వడంతో ఈ కన్ఫ్యజన్ ప్రారంభమయింది. ముందుగా ఓ ఐఏఎస్ అధికారి ట్వీట్ చేసారు. 



 






కొంతమంది ఆదిలాబాద్‌లో ఔత్సాహిక యువకులు దీన్ని తయారుచేశారని చెబుతూంటే.. మరికొందరు మాత్రం మహారాష్ట్రకు చెందినవారు చేశారని అంటున్నారు. 





తెలుగుప్రజలు కూడా చాలా మంది ఈ  బండి ఐడియాను అభినందిస్తున్నారు.