భాగ్యమ్మ రుక్మిణి ముఖాన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖమంతా పసుపు రాస్తుంది. దేవుడమ్మ వాళ్ళందరూ అమ్మవారి దగ్గర బోనాలు సమర్పిస్తారు. దేవుడమ్మ బోనం దించే సమయానికి అమ్మవారు పూనిన ఒక మహిళ అక్కడికి వస్తుంది. 'నీ మనసులో ఒక కోరిక ఉంది. నన్ను నమ్మి మోసపోయిన వాళ్ళు లేరు. ఆశపడి బిడ్డలని అడిగితే కాదు అనను. నీ కోరిక తీరుస్తా. నువ్వు అడిగింది నీ దగ్గరకి నడిపిస్తా. కళ్ల ముందు కనిపించినా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్లా. కళ్ళు తెరిచి చూడు నువ్వు కోరింది నువ్వే గుర్తుపట్టాలి. నడిపిస్తా' అని చెప్పడంతో ఆదిత్య, సత్య షాక్ అవగా దేవుడమ్మ సంతోషిస్తుంది. నా కోడలు నా ఇంటికి రావడమే నాకు కావాలి, నా కోరిక తీరుతుందా తల్లి అని అడిగితే అడుగులు పడుతున్నాయి వస్తుంది చూసుకో అని చెప్తుంది. ఆ మాటలకి మాధవ కూడా షాక్ అవుతాడు. మరోవైపు భాగ్యమ్మ రుక్మిణిని గంగమ్మ దగ్గర బోనం సమర్పించేందుకు వెళ్ళమని చెప్తుంది. దీంతో రుక్మిణి దేవుడమ్మ వాళ్ళు ఉన్న గుడికే వస్తుంది. 


ఆదిత్య ఒకచోట కూర్చుని జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉండగా దేవి అక్కడికి వస్తుంది. అమ్మవారికి నువ్వు ఏమని మొక్కావ్ అని అడుగుతుంది. నువ్వు మీ అమ్మ బాగుండాలని మొక్కుకున్న అని చెప్తాడు. అదేంది సారు మాయమ్మ కోసం ఎందుకు మొక్కినారు అని అడుగుతుంది. తల్లి బాగుంటేనే కదా బిడ్డ బాగుండేది అందుకే అలా మొక్కుకున్న అని కవర్ చేస్తాడు. నేను ఏమి మొక్కినానో తెలుసా చెస్ పోటీల్లో గెలవాలి నీ పేరు నిలబెట్టాలని కోరుకున్న అని చెప్పడం మాధవ దూరం నుంచి విని రగిలిపోతాడు. నువ్వు ఏది కోరుకుంటే అది జరిగేలా చూస్తానని ఆదిత్య అంటాడు. నా కూతుర్ని నీ మాటలతో మాయ చేస్తున్నవా ఆదిత్య నేనెంటో నీకు చూపిస్తా అని మాధవ కోపంగా అనుకుంటాడు. 


Also Read: కైలాష్ కి యష్ స్వీట్ కూల్ వార్నింగ్, సారిక కోసం వెతుకులాట- యష్, వేద క్యూట్ రొమాన్స్


కమల, భాష రుక్మిణి గురించి మాట్లాడుకుంటారు. పటేల్ సారు కూడా చాలాసార్లు చెప్పాడు రుక్కు బతికే ఉందని కానీ మనం నమ్మలేదు, ఇప్పుడు అమ్మవారు కూడా అదే చెప్తున్నారు అని భాష అంటాడు. రుక్కు బతికే ఉందని నేను నమ్ముతున్నాను కానీ ఇంటికి ఎందుకు రావడం లేదని కమల బాధపడుతుంది. ఇక రుక్మిణి బోనం సమర్పించేందుకు దించబోతుంటే దేవుడమ్మ ఆగమ్మాయి అని అరుస్తుంది. అత్తమ్మ నన్ను గుర్తుపట్టిందా అని రుక్మిణి భయపడుతుంది. ఎంటమ్మ నువ్వు చేస్తుంది, ఇలా ఎవరయినా బోనం దింపుతారా, పెద్ద ముత్తైదువు దింపాలి అని అంటుంది. ఇక రుక్మిణి బోనాన్ని దేవుడమ్మ తీసుకుని దింపగానే తన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. 


సత్య అటుగా రావడం గమనించిన మాధవ కావాలని చిన్మయి దగ్గరకి వస్తాడు. నువ్వు దేవి కలిసి బోనం ఎత్తుకుంటారు అనుకున్నా కానీ ఇలా జరిగిందేంటి అని బాధపడుతున్నట్టు నటిస్తాడు. మా అమ్మ ఎత్తుకున్న, నువ్వు ఎత్తుకున్న నాకు సంతోషంగా లేదు ఎందుకంటే మీ మధ్య దేవి లేదు అందుకే నాకు బాధగా ఉందని అంటాడు. వెంటనే అక్కడికి సత్య వచ్చి ఏంటి బావగారు దేవి గురించి బాధపడుతున్నారని అడుగుతుంది. బాధ లేకుండా ఎలా ఉంటుంది బోనాల పండగ కోసం ఇంటికి తీసుకు రావాలని అనుకున్నా కానీ నేను ఇంటికి రాను అని నా మొహం మీద చెప్పింది అని మాధవ బాధపడుతున్నట్టు నటిస్తాడు. సరిగా ఆ మాటలు చెప్పే సమయానికి దేవి కూడా అక్కడికి వచ్చి వింటుంది.  


Also Read: వసు అనే చిక్కు లెక్కని పరిష్కరించే పనిలో లెక్కల మాస్టారు రిషి, జగతి దెబ్బకు సైలెంటైపోయిన దేవయాని