తీవ్రవాదులు, మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై.. గూఢచర్యం కోసం రూపొందిన మిలిటరీ-గ్రేడ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి.. తన ఫోన్ హ్యాక్ చేశారని చెబుతున్నాడు ఓ జర్నలిస్తు. తనకు టెక్ట్స్ సందేశం వచ్చిన తర్వాత.. ఇక తన ఫోన్ ను యాక్సెస్ చేశారని అంటున్నాడు.
'సైబర్ నేరగాళ్లు 2020 లేదా 2021 లో "జీరో-క్లిక్ ఎక్స్‌ప్లోయిట్"తో నా ఫోన్ లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది.  అంటే వారు చేయాల్సిందల్లా పరికరానికి సందేశాన్ని పంపి.. హ్యాక్ చేయడమే. అయితే హ్యాకర్లు దాడి చేసేందుకు పెగాసస్ అనే వివాదాస్పద సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టు అనిపిస్తోంది.' అని హబ్బర్డ్ అనే జర్నలిస్టు చెబుతున్నారు.


పెగాసస్ అనేది రహస్య హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్  ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ NSO గ్రూప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడింది. ఇది ఫోన్ లోకి, కంప్యూటర్ పరికరాల్లోకి చొరబడి వాటిని నిఘా పరికరాలుగా మార్చడానికి రూపొందించారు. దీని ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా మీకు తెలియకుండా మిమ్మల్ని చిత్రీకరించగలదు. మీ కాల్స్ ను రికార్డు చేసి కావాల్సిన వాళ్లకు పంపొచ్చు. ఈ సాఫ్ట్ వేర్ మీ జీపీఎస్ ని ఉపయోగించే మీరు ఎక్కడ ఉన్నారో చెబుతుంది. 


ఎన్ఎస్ఓ ఈ సాఫ్ట్ వేర్ ను  నేరాలను నియంత్రించడానికి, ఉగ్రవాదులను ట్రాక్ చేయడంలో సహాయపడటానికి అని చెప్పినా.. ఇతర సమస్యలు తెచ్చిపెట్టింది. మెక్సికోలో పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పెగాసస్ ను ఉపయోగించారు. ఇతర దేశాల్లోనూ ఈ సాఫ్ట్ వేర్ తో నిఘా పెట్టారని ఆరోపణలు వచ్చాయి.


అయితే ఇలానే జర్నలిస్టు హబ్బర్డ్ ఫోన్ కూడా హ్యాక్ చేశారు. ఇదే అతని అభిప్రాయం కూడా. స్పైవేర్ పరిశోధనా సంస్థ అయిన సిటిజెన్ ల్యాబ్‌తో సాయంతో పెగాసస్‌కు సంబంధించిన టెక్స్ట్ మూలాన్ని కనుగొనగలిగాడు హబ్బర్డ్. సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టు చెబుతున్నారు. 2020 మరియు 2021లో "జీరో-క్లిక్" ద్వారా  రెండుసార్లు హ్యాక్ చేయబడిందని కనుగొన్నారు.


మొదటి హ్యాక్‌కు సంబంధించిన సాక్ష్యాలను తొలగించే ఉద్దేశంతో రెండో దాడి జరిగినట్లు తెలుస్తోంది.  అయితే జర్నలిస్టు హబ్బర్డ్  ఫోన్‌ను హ్యాక్ చేయడానికి తమ సాఫ్ట్‌వేర్ ఉపయోగించారనేది అబద్ధామని ఎన్ఎస్ఓ ఖండించింది. జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి దీనిని ఉపయోగించారనే వాదనలను తోసిపుచ్చుతోంది.


బాధితుడి నుంచి ఎలాంటి రెస్పాన్స్  లేకున్నా.. "జీరో-క్లిక్ అటాక్"తో ఫొన్ లోకి చొరబడొచ్చని.. సిటిజెన్ ల్యాబ్ అంటోంది సాధారణంగా, హ్యాకర్ స్పైవేర్‌ను లోడ్ చేయడానికి లింక్‌ను తెరవాలని కోరుకుంటారని.. అయితే హ్యాకర్లు మీ పరికరంలో పెగాసస్‌ను సాధారణ టెక్స్ట్ లేదా ఫోన్ కాల్‌తో లోడ్ చేస్తారని వెల్లడించింది. మీరు టెక్స్ట్‌తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. 


Also Read: WHO ON Covaxin: కొవాగ్జిన్ అత్యవసర వినియోగంపై డబ్ల్యూహెచ్‌వో సమీక్ష... 24 గంటల్లో అనుమతి లభించే అవకాశం..!


Also Read: PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?