పరిస్థితులు మారాయి. ఇప్పుడంతా ఆన్ లైన్ చదువులు. ఉపాధ్యాయులూ అప్ డేట్ అయిపోయారు. పిల్లలకు పాఠాలు చేరేలా యూ ట్యూబ్ ఛానళ్లతో విద్యార్థుల దగ్గరకు వెళ్తున్నారు. కానీ ఓ ఉపాధ్యాయుడు లెక్కల పాఠాలు చెప్పేందుకు మాత్రం.. డిఫరెంట్ స్టైల్ ని ఎంచుకున్నాడు. అలాంటి.. ఇలాంటి ఆలోచన కాదది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే.. పోర్న్ హబ్ సైట్ లో తన లెక్కల పాఠాలు చెబుతున్నాడు. అక్కడ పాఠాలు చెబితే ఎవరు చూస్తారనే కదా మీ డౌటనుమానం. అంత లేదండి.. పోర్న్ హబ్ లో పాఠాలు చెబుతూ.. వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఈ మాష్టారుకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది?
తైవాన్ కు కు చెందిన చాంగ్షు అనే ఉపాధ్యాయుడు పోర్న్ హబ్ లో లెక్కల పాఠాలు చెబుతున్నాడు. ఇప్పటి వరకు అడల్ట్ కంటెంట్ లేని.. 200 వీడియోలు అప్ లోడ్ చేశాడు. గణితం పాఠాలైనా.. జనాలు ఎక్కువగానే చూస్తున్నారు. గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు చాంగ్షు. 15 ఏళ్లుగా తైవాన్ పాఠశాలలు, ఆన్ లైన్ లో పాఠాలు చెబుతున్నాడు. కొన్ని రోజులు తన లెక్కల పాఠాలను యూట్యూబ్ లో కూడా బొధించాడు. అయితే తాను చెప్పే గణితం పాఠాలను విస్తరించాలనుకున్నాడు. ఎలా అని తెగ ఆలోచించాడు. ప్రపంచంలో ఎక్కువ మంది చూసే పోర్న్ హబ్ సైట్ అతడికి కనిపించింది. దానిపైనే పాఠాలు చెబితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు.
మెుదట పోర్న్ హబ్ లో కొన్ని పాఠాలు అప్ లోడ్ చేశాడు చాంగ్షు. రివ్యూలు మంచిగా రావడంతో ఇక కంటిన్యూ చేశాడు. 'changhsumath666' పేరుతో పోర్న్ హబ్ లో తన ఖాతా రిజిస్ట్రర్ అయి కూడా ఉంది. 'అడల్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో చాలా తక్కువ మంది గణితాన్ని బోధిస్తారు. వాటిలో వీడియోలను చూసే వారు చాలా మంది ఉన్నారు కాబట్టి, నేను నా వీడియోలను అక్కడ అప్‌లోడ్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది.. ప్రజలు వాటిని చూస్తారు.' అనుకున్నాని చెబుతున్నాడు చాంగ్షు. XVideos. NXNN వంటి ఇతర అడల్ట్ వెబ్‌సైట్‌లకు పోస్ట్ చేసి.. తన గణిత పాఠాలను మరింత విస్తరించాలనుకున్నాడు. అయితే ఆ ప్లాట్‌ఫారమ్‌లు ఈ పాఠాల వీడియోలను అనుమతించలేదు.
దాదాపు 60% లేదా అంతకంటే ఎక్కువ మంది వీక్షకులు తన వీడియోలను ఆ సైట్ లో కామెడీగా చూస్తారేమోనని చాంగ్షు అభిప్రాయపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ తన వీడియోలపై ఆసక్తి చూపకపోవచ్చు అని చెబుతున్నాడు. పోర్న్ హబ్ లో గణితం చెప్పే టీచర్ ఉన్నాడని.. ఆ సైట్ కి వచ్చే చాలా మందికి తెలుసు అని అంటున్నాడు. పోర్న్ హబ్ లో పాఠాలు చెప్పడం ద్వారా..ఏడాదికి 250,000 డాలర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్టు తెలిపాడు. వచ్చిన ఆదాయాన్ని.. వేరే ప్లాట్ ఫారమ్స్ లో తనకు పాఠాలు బొధించేందుకు సహాయ పడేవారికి చెల్లిస్తాడట. మిగిలినవి తన ఖర్చులకు ఉపయోగించుకుంటానని చాంగ్షు అంటున్నాడు.
'పోర్న్ హబ్ లో పాఠాలు బొధించడం నాకు ఇష్టం లేదు. చాలా మంది విద్యార్థులు అక్కడ నా కోర్సులను కొనుగోలు చేస్తారు. గణితం బాగా చెప్పే.. తైవాన్ ఉపాధ్యాయుడని ప్రపంచానికి తెలియాలని నా కోరిక.' అంటున్నాడు చాంగ్షు.
Also Read: Migraine Pain: చేపలతో తలనొప్పికి విరుగుడు... తరచూ తింటే మైగ్రేన్ మాయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి