ABP  WhatsApp

India Oil Imports: భారత్‌కు అమెరికా వార్నింగ్- రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటే వాళ్లకేంటి నొప్పి!

ABP Desam Updated at: 16 Mar 2022 04:31 PM (IST)
Edited By: Murali Krishna

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారత్‌కు అపఖ్యాతి వస్తుందని అమెరికా హెచ్చరించింది.

భారత్‌కు అమెరికా వార్నింగ్

NEXT PREV

భారత్‌ను అమెరికా పరోక్షంగా హెచ్చరించింది. భారత్‌కు రష్యా ఇచ్చిన ఆయిర్ ఆఫర్‌పై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిస్కౌంట్ ధరకు చమురు ఇస్తామని రష్యా ఇచ్చిన ఆఫర్‌ను భారత్ స్వీకరిస్తే ఉక్రెయిన్‌పై దండయాత్రకు మద్దతిచ్చినట్లవుతుందని అమెరికా అభిప్రాయపడింది. ఇది చరిత్రలో భారత్‌కు అపఖ్యాతి తెస్తుందని హెచ్చరించింది. 



ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యాపై చాలా ఆంక్షలు అమలవుతున్నాయి. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్‌ను భారత దేశం కొనడం ఆ ఆంక్షలను ఉల్లంఘించినట్లు అవుతుందని భావించడం లేదు. అయితే భారత్ అటువంటి నిర్ణయం తీసుకుంటే చరిత్రలో ఆ దేశానికి అపఖ్యాతి వస్తుంది. ప్రస్తుతం రాసే చరిత్ర పుస్తకాల్లో ఏ వైపు ఉండాలనుకుంటున్నదీ భారత్ నిర్ణయించుకోవాలి. రష్యా నాయకత్వానికి మద్దతివ్వడమంటే దండయాత్రకు మద్దతివ్వడమే. మేం విధించిన, సిఫారసు చేసిన ఆంక్షలను పాటించాలని ప్రతి దేశాన్నీ కోరుతున్నాం                                                                - జెన్ సాకీ, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ 


రష్యా ఆఫర్


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోన్న కారణంగా అమెరికా, నాటో దేశాలు ఆ దేశ చమురుపై పూర్తిస్థాయి నిషేధం విధించాయి. దీంతో రష్యా చమురును కొనుగోలు చేసేవారి సంఖ్య పడిపోయింది. దీంతో రష్యా భారత్‌కు బంపర్ ఆఫర్‌ ఇచ్చింది. అతి తక్కువ ధరకే భారత్‌కు క్రూడాయిల్‌ విక్రయిస్తామని చెప్పింది. 


ఎందుకంటే


తమ దేశం నుంచి ఎవరూ చమురు కొనుగోలు చేయకపోవడం వల్ల రష్యా వద్ద చమురు నిల్వలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతి రోజు 7 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసేది. అంతేగాకుండా ప్రపంచ చమురు అవసరాల్లో 12 శాతం.. సహజ వాయువులో 16 శాతం అవసరాలను రష్యా తీరుస్తుంది. ఇప్పుడీ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమురును భారత్‌కు అతి తక్కువ ధరకే విక్రయిస్తామంటూ రష్యా చమురు కంపెనీలు ఇప్పటికే భారత్‌కు ఆఫర్ చేశాయి. 


అయితే రష్యా ఇచ్చిన ఆఫర్‌పై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యా ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చిన విషయం వాస్తవమేనని.. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. 


Also Read: Bhagwant Mann Swearing-In: పంజాబ్‌ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం- ఈ రికార్డ్ గమనించారా?


Also Read: Navjot Singh Sidhu Resignation: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా- ఇదేంటి అంత చిన్న రిజైన్ లెటర్!

Published at: 16 Mar 2022 04:25 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.