పరిస్థితులు మారిపోతున్నాయి. నగరాల్లో జీవించడమంటే.. చాలామందికి నరకంలా కనిపిస్తోంది. ఏదో బతకలిగా అన్నట్టు బతికేస్తున్నారు. మనలో చాలా మంది నగరాల నుంచి బయటకు వెళ్లి పోదాం..రా బాబు అనుకున్నవారే కదా. ఇక కొవిడ్ మెుదలైన సమయంలో ఇదేంటీ.. అడవిలో బతికేస్తే ఎంత బాగుంటుందోనని ఆలోచన వచ్చిన వారు కూడా ఉన్నారు. అప్పుడే ఈ రకమైన ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. అయితే దానినే ఒక ఐడియాగా తీసుకుంది.. అమెరికాకు చెందిన ఓ కంపెనీ. ఇదీ... అదీ అని కాకుండా.. అన్నీ సౌకర్యాలు ఉండేలాగా ఎడారి నడి మధ్యలో ఇంటిని నిర్మించేసింది.  


అనుకున్నదే.. మెుదలు ..ఎల్ సిమెంటో యూనో అనే పేరుతో ఇల్లు నిర్మించేసింది. ఈ ఇల్లు కాలిఫోర్నియాలోని మెుజావే ఎడారిలో ఉంది. ఈ ఇంట్లో అన్నీ ఏర్పాటు చేశారు. కానీ ధర చూస్తేనే.. తల తిరిగిపోయేలా ఉంది. ఇంతకీ ఈ ఇంటి ధర ఎంతో తెలుసా.. రూ .12.9 కోట్లు. అవును అంత ధర పెట్టి.. దీనిని కొనుగోలు చేయాలి. కానీ సౌకర్యాలు మాత్రం సూపర్ గా ఉంటాయట.


 






ఆ అమెరికన్ కంపెనీ ఈ ఇంటికి సంబంధించిన ప్రకటనను తన ఇన్ స్టా పేజీలో పెట్టింది. ' ఈ ఇంటిని చాలా ప్రత్యేకమైనది. దీంట్లో నివసించడం ఒక ప్రత్యేకత. ఇది బండ రాళ్ల మధ్య నిర్మించబడింది. 5 ఎకరాల స్థలం.. కానీ వంద ఎకరాలకుపైగానే ఉన్న అనుబూతి కలుగుతుంది. మీ ప్రైవసీ కూడా  ఎలాంటి సమస్య ఉండదు. ఓ గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. URBARC ఆర్కిటెక్ట్‌లతో రూపొందించాం' అని ఆ కంపెనీ ప్రచారం చేసుకుంటోంది.


ఇంటి ధర ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇది ఏ ఇతర ఇల్లు ఇవ్వలేని ప్రత్యేక అనుభూతులను అందిస్తుంది.  ఎడారిలో నివసించాలి.. ఎవరూ లేని ప్రదేశాల్లో గడపాలని అనే ఆలోచనలు ఉన్న వారికి ఈ ఇల్లు సరిగా సెట్ అవుద్ది.


 


Also Read: Space-X Inspiration4 Launch: సరికొత్త చరిత్ర.. కేవలం పౌరులతో అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న తొలి రాకెట్ ప్రయోగం.. 


Also Read: కుమార్తె ఎత్తు పెరగడానికి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా.. వామ్మో మరీ అంతలానా..