ప్రపంచంలోని అపరకుబేరులలో ఒకరైన ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష మిషన్ కొనసాగుతోంది. తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునే పనిలో బిజీగా ఉన్న ఎలాన్ మస్క్.. 'ఇన్‌స్పిరేషన్4' పేరుతో నలుగురిని కక్ష్యలోకి పంపనున్నారు. ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పెస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో నలుగురు వ్యక్తులు మూడురోజుల పాటు అంతరిక్షంలో గడపున్నారు. ఇందుకు రంగం సిద్ధమైంది.
సెప్టెంబర్ 15వ తేదీన స్పేస్ ఎక్స్ వారి 'ఇన్‌స్పిరేషన్4' మిషన్ బయలుదేరనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఇటీవల ప్రకటన చేసింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని నాసా ప్యాడ్ 39 ఏ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోనికి దూసుకుపోనుంది. అయితే ఇది ప్రపంచంలోనే తొలి సివిలియన్ స్పేస్‌ఫ్లైట్ కావడం విశేషం. రిచర్డ్ బ్రస్నన్‌కు చెందిన వర్జిన్ గెలాక్టిక్, అమెజాన్ మాజీ బాస్ జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజన్ తరువాత ఈ ఏడాది అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న మూ.డో అంతరిక్ష నౌకగా ఇన్‌స్పిరేషన్4 నిలవనుంది. బెజోస్, బ్రస్నన్ ప్రయోగించినవి ఉపకక్షలోకి వెళ్లే రాకెట్స్, కాగా తాజా ప్రయోగం మాత్రం కక్షలో మూడు రోజులపాటు గడపున్నారు.
సెయింట్ జూడ్ చిన్నారుల దవాఖాన, పరిశోధనా కేంద్రం కోసం నిధులు సమీకరించే ప్రయత్నంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన ఇన్‌స్పిరేషన్ 4 మిషన్‌లో.. టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ జారెడ్ ఐజాక్‌మాన్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. గతంలో పైలట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న 37 ఏళ్ల ఐజాక్‌మాన్‌తో పాటు హేలీ అర్కెనాక్స్, సియాన్ ప్రొక్టర్, క్రిస్ సెంబ్రోస్కిలు రాకెట్‌లో ప్రయాణించి కక్షలో 3 రోజులు గడపునున్నారు.
Also Read: రెండు వారాల్లోనే యూట్యూబ్ మరో కీలక నిర్ణయం.. మ్యూజిక్ లవర్స్‌కు మళ్లీ నిరాశేనా.. అసలేం జరుగుతోంది!
ఎక్కడ వీక్షించాలి..
భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి ఎగరనుందని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ ఈ సమయంలో రాకెట్ ప్రయోగం వీలుకాని పక్షంలో గురువారం ఉదయం 5:35 గంటలకు ప్రయోగానికి మరో టైమ్ షెడ్యూల్ చేశారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని నాసా ప్యాడ్ 39 ఏ నుంచి ప్రయోగం జరగనుంది. స్పేస్ ఎక్స్ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని సంస్థ ప్రకటించింది.
Also Read: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు చవకైన ప్లాన్లు తీసేసిన కంపెనీ!