సెర్చింజన్ గూగుల్ కంపెనీకి చెందిన సంస్థ యూట్యూబ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మ్యూజిక్ విషయంలో పాపులర్ బాట్, గ్రూవీని యూట్యూబ్ తొలగించింది. తాజాగా మరో బాట్, రిథమ్‌ను సైతం తొలగించాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి మ్యూజిక్ ప్రేమికులు యూట్యూబ్‌లో తమకు గతంలో మాదిరిగా ఎంజాయ్ చేయలేరు. ఛాటింగ్ మరియు స్ట్రీమింగ్ యాప్ డిస్కార్డ్ లో ఆన్ లైన్ గేమర్లు ఒకచోటకు వస్తారు. కానీ ఇకంనుంచి ఇందులో మ్యూజిక్ తగ్గుతుంది. అందుకు యూట్యూబ్ తాజాగా తీసుకున్న నిర్ణయమే కారణం.
మ్యూజిక్ బాట్ రిథమ్ అనేది థర్డ్ పార్టీకి చెందిన ప్లగిన్. దీనిద్వారా యూజర్లు యూట్యూబ్ లో మ్యూజిక్‌ను ఆస్వాదించేవారు. కానీ రిథమ్ సేవల్ని నిలిపివేయాలని యూట్యూబ్ నిర్ణయం తీసుకుంది. గూగుల్ నుంచి చట్టపరంగా డిమాండ్లు రావడంతో ఇటీవల గ్రూవీ సేవల్ని నిలిపివేయగా, తాజాగా రిథమ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఆగస్టు 30 నుంచి గ్రూవీ సేవలు కోల్పోయిన మ్యూజిక్ లవర్స్.. సెప్టెంబర్ 15 నుంచి రిథమ్ సేవల్ని కోల్పోనున్నారు. 20 మిలియన్ల మంది రిథమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగా.. డిస్కార్డ్ సర్వర్ల ద్వారా మొత్తం 560 మిలియన్ల మంది యూజర్లు ఈ మ్యూజిక్ సేవల్ని వినియోగించుకుంటున్నారు.
Also Read: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు చవకైన ప్లాన్లు తీసేసిన కంపెనీ!
దీనిపై రిథమ్ క్రియేటర్ యోవో వెర్జ్ మీడియాతో మాట్లాడారు. ఇలాంటివి సాధారణంగానే జరుగుతుంటాయి. కనుక గత ఏడాది నుంచి మేం ఇతర మార్గాలు సైతం అన్వేషిస్తున్నాం. అయితే గ్రూవీ మ్యూజిక్ బాట్ సేవలు నిలిపివేసిన తక్కువ వ్యవధిలో ఈ నిర్ణయం వస్తుందని ఊహించలేదన్నారు. మ్యూజిక్ రంగంలోనూ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తుందో యూట్యూబ్ నిర్ణయంతో అర్థమైందన్నారు. ప్రతినెలా 30 మిలియన్ల డిస్కార్డ్ యూజర్లకు రిథమ్ సేవలు అందిస్తోంది. డిస్కార్డ్‌కు ఏకంగా ప్రతినెలా 150 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉండగా.. మరో రెండు రోజుల తరువాత మ్యూజిక్ లవర్స్ యూట్యూబ్ నుంచి తమ మ్యూజిక్ సేవల్ని కోల్పోనున్నారని స్పష్టం చేశారు.
Also Read: టెక్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్ రేపే.. ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే!
యూట్యూబ్ తాజా నిర్ణయాలు గమనిస్తే థర్డ్ పార్టీ సేవలకు స్వస్తి పలికి సొంతంగానే పూర్తి స్థాయిలో మ్యూజిక్ సహా వీడియో సేవల్ని అందించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇతర కంపెనీ సర్వర్లకు బదులుగా సొంతంగా సర్వర్లు రూపొందించి వాటి ద్వారా ఎలాంటి ఆంక్షలు లేకుండా సంగీతాభిమానులకు సేవలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి.