దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలైన అదానీ సోదరులు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదివారం సీక్రెట్‌గా వచ్చి కలిశారన్న ప్రచారం మీడియాలో జరుగుతోంది. అది వ్యక్తిగత పర్యటన కాబట్టి అధికారికంగా ప్రకటించలేదని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో అసలు నిజమేంటో తెలియదు. అందుకే మీడియా అంతా ప్రెస్‌మీట్ పెట్టిన పరిశ్రమ మంత్రి గౌతం రెడ్డినే అడిగింది. స్కిల్ యూనివర్శిటీల మీద జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి గౌతంరెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత సమీక్ష వివరాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన వివరాలన్నీ చెప్పిన తర్వాత మీడియా ప్రతినిధులు గౌతం అదానీ సోదరులు వచ్చి జగన్‌తో భేటీ కావడంపై ప్రశ్నించారు. Also Read : కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు!
అయితే గౌతం రెడ్డి ఈ వార్తలను ఖండించలేదు. అలా ఎవరూ వచ్చి సమావేశం కాలేదని చెప్పలేదు. కానీ ఆ విషయం తనకు తెలియదని మాత్రం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ మంత్రిగా గౌతం రెడ్డి ఉన్నారు. బడా పారిశ్రామికవేత్తలు ఎవరైనా ముఖ్యమంత్రితో సమావేశానికి వస్తే ఖచ్చితంగా పరిశ్రమ మంత్రి కూడా ఉంటారు. ఏదైనా ఆయన శాఖ ద్వారా జరుగుతుంది కాబట్టి సమావేశాల్లో ఆ మంత్రి ఉండేలా చేస్తారు. అలా లేకపోయినా కనీసం ప్రోటోకాల్ ప్రకారమైనా పిలుస్తారు. కానీ మంత్రి గౌతంరెడ్డి అసలు అలాంటి సమావేశం జరిగిందో లేదో తెలియదు. జరగలేదని ఖండించలేదు కాబట్టి గౌతంరెడ్డి తనకు తెలియదని చెప్పినట్లుగా భావిస్తున్నారు. Also Read : "స్కిల్" స్టేట్‌గా ఏపీ... యూనివర్శిటీ, కాలేజీల ఏర్పాటుకు కీలక నిర్ణయాలు !
అయితే అదానీ సోదరులు సీఎం జగన్ తో సమావేశం కావడం అన్న అంశం చర్చనీయాశం కావడానికి టైమింగ్ కూడా ఓ కారణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు ప్రధానమైన పోర్టులు కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీ పోర్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ రెండు కొనుగోళ్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషరన్లు ప్రొప్రయిట్రీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణపట్నం విషయంలో కాకపోయినా గంగవరం పోర్టు విషయంలో ఈ ఆడిట్ కీలకంగా మారనుంది. 10.4శాతం ఉన్న ప్రభుత్వ వాటాను అతి తక్కువకే అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. Also Read : కలెక్టర్ దగ్గరికి కారం, కత్తి, నకిలీ తుపాకీతో వచ్చిన వ్యక్తి.. పోలీసులు షాక్!
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై వాదనలో ఏపీ ప్రభుత్వం అధికారులు నివేదిక ఇచ్చినందునే అమ్మామని ప్రభుత్వం వాదిస్తోంది. అమ్మదల్చుకుంటే అంతర్జాతీయంగా టెండర్లు పిలవాలని అంటున్నారు. ఈ పిటిషన్లు దాఖలైన సమయంలో అదాని సోదరులు వచ్చి జగన్‌ను కలవడం ఆసక్తి రేపుతోందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ భేటీ జరిగిందో లేదో ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే ఊహాగానాలకు తెరపడుతుంది. లేకపోతే రకరకాలుగా చర్చలు, ఊహాగానాలు జరుగుతూనే ఉంటాయి.