ఐపీఎల్ 2021 రెండో ద‌శ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టులో కీల‌క మార్పు జ‌రిగింది. ఇంగ్లండ్ బౌల‌ర్ క్రిస్ వోక్స్ స్థానంలో ఆస్ట్రేలియ‌న్ బౌల‌ర్ బెన్ డ్వార్షస్ మిగతా టోర్న‌మెంట్ ఆడ‌నున్నాడు.


వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో టోర్నీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు పేసర్ క్రిస్ వోక్స్ తెలిపాడు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మ‌న్ డేవిడ్ మ‌ల‌న్, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆటగాడు జోస్ బ‌ట్ల‌ర్ లు ఇప్ప‌టికే టోర్నీ నుంచి త‌ప్పుకోగా, ఇప్పుడు క్రిస్ వోక్స్ కూడా ఆ జాబితాలో చేరాడు. ఐపీఎల్ ప్ర‌థ‌మార్థంలో క్రిస్ వోక్స్ మూడు మ్యాచ్ లాడి ఐదు వికెట్లు తీశాడు.


ఇక బెన్ డ్వార్ష‌స్ విష‌యానికి వ‌స్తే.. అతడి ఖాతాలో 100 టీ20 వికెట్లు ఉన్నాయి. బెస్ట్ బౌలింగ్ 4-13 కాగా, స్ట్రైక్ రేట్ 17.3గా ఉంది. బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్స‌ర్స్ జ‌ట్టుకు బెన్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. మొత్తం టోర్న‌మెంట్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌల్ల‌ర‌లో త‌ను ఆరో స్థానంలో ఉన్నాడు. బిగ్ బాష్ లీగ్ లో ఇప్ప‌టివ‌ర‌కు 69 మ్యాచ్ లు ఆడిన బెన్ 85 వికెట్లు తీసుకున్నాడు.


Also Read: US Open 2021: తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కొట్టిన మెద్వెదెవ్.. ఆ రికార్డుకు దగ్గరలో ఆగిపోయిన ప్రపంచ నంబర్ వన్ జకోవిచ్‌


బెన్ డ్వార్షస్ త్వ‌ర‌లో యూఏఈలో ఉన్న జ‌ట్టు బ‌యో బబుల్ లో చేర‌తాడ‌ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపింది. బెన్ డ్వార్ష‌స్ 2018 ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. అయితే తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.


ఇంగ్లండ్ టూర్ లోని భార‌త జ‌ట్టులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆట‌గాళ్లు కూడా దుబాయ్ కి చేరుకున్నారు. ఐపీఎల్ తొలి సగంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన రిష‌బ్ పంత్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, పృథ్వీ షా, అజింక్య ర‌హానే, అక్ష‌ర్ ప‌టేల్, ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేశ్ యాద‌వ్ లు ఈ ఆట‌గాళ్ల‌లో ఉన్నారు. వీరంద‌రికీ ఫ‌లిత‌ం కోవిడ్ నెగిటివ్ వ‌చ్చింది.


ఐపీఎల్ మొద‌టిభాగంలో అప్ప‌టి కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ గాయాల బారిన ప‌డ‌టంతో రిష‌బ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయ‌కత్వం వ‌హించి జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపించాడు. ప్ర‌స్తుతానికి ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ లాడి 6 మ్యాచ్ ల్లో విజ‌యం సాధించింది. మొత్తం 12 పాయింట్ల‌తో ఐపీఎల్ పాయింట్ల పట్టిక‌లో మొద‌టి స్థానంలో ఉంది. సెప్టెంబర్ 22వ తేదీన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో ఢిల్లీ రెండో ద‌శ‌లో మొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది.


Also Read: PCB New Chairman: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త ఛైర్మ‌న్.. చ‌రిత్ర‌లో నాలుగోసారి మాత్ర‌మే!


Also Read: Rohit Sharma: టీ 20 వరల్డ్ కప్ తర్వాత.. పరిమిత ఓవర్ల ఫార్మట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..