ఫైనల్ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ యుఎస్‌ ఓపెన్​లో సెర్బియా ఆటగాడు నొవాక్‌ జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. రష్యా ప్లేయర్ మెద్వెదేవ్ చేతిలో ఓడిపోయాడు. ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు అందుకున్న ఆటగాడి రికార్డుకు కొద్ది దూరంలోనే జకోవిచ్ ఆగిపోయాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, అర్ధశతాబ్దం తర్వాత కేరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించి చరిత్ర తిరగరాద్దమనుకున్న ప్రపంచ నంబర్‌వన్‌ నోవాక్‌ జకోవిచ్‌కు షాక్‌ ఇచ్చాడు మెద్వెదెవ్. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో 34 ఏళ్ల జకోవిచ్‌ను ఓడించాడు. 


 






తొలిసెట్‌లో 6-4 తేడాతో మెద్వెదెవ్‌దే పైచేయి సాధించినప్పటికీ రెండో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్‌ బ్రేక్‌లతో ఆటను ఉత్కంఠ స్థితికి తీసుకొచ్చారు. జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా  మెద్వెదెవ్‌ 6-4 తేడాతో రెండో సెట్‌ లో విజయం సాధించాడు. మూడో సెట్‌లో జకోవిచ్‌ మొదట అలా అలా... ప్లే చేసినా.. తర్వాత పుంజుకున్నాడు. అయినా మెద్వెదెవ్‌ విజయం సాధించాడు. ఈ సెట్‌లో మెద్వెదెవ్‌ 6-4 తేడాతో గెలిచాడు. డానిల్‌ మెద్వెదెవ్‌ మూడో సెట్‌ను గెలిచాడు. 2019లో యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి ఓటమి పాలయ్యాడు మెద్వెదెవ్. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో కేవలం ఒక్కసెట్‌లో మాత్రమే ఒడిపోయి టైటిల్‌ గెలిచిన ఆటగాడిగా  మెద్వెదెవ్‌ నిలిచాడు.


 





 


దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్‌ ఇంకొన్ని రోజులపాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే జకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. చరిత్ర సృష్టిద్దామనుకుంటే.. నిరాశే ఎదురైంది.


Also Read:  US Open 2021: చరిత్ర సృష్టించిన ఎమ్మా రదుకాను... 18 ఏళ్లకే యూఎస్ గ్రాండ్ స్లామ్... ఫైనల్ లో వరుస సెట్లలో ఘన విజయం