హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు గురైనప్పటి నుంచి భిన్నమైన రీతిలో వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా యువత వేగం తగ్గించుకోవాలని, పెద్దవారు చెప్పే మాటలను పట్టించుకోవాలని పలువురు వాదిస్తున్నారు. ఇంకొందరు మాత్రం రోడ్డును క్లీన్‌గా ఉంచని జీహెచ్ఎంసీపై కూడా కేసు పెట్టాలని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కోరారు. రోడ్డుపై ఇసుక వేసేందుకు కారణమైన నిర్మాణ సంస్థకు కూడా భారీ జరిమానా వేయాలని డిమాండ్లు వచ్చాయి. అతి వేగంగా బండి నడిపినందుకు సాయి ధరమ్ తేజ్‌పై కేసు పెట్టినప్పుడు.. ఇసుక ఉన్నందుకు కారణమైన జీహెచ్ఎంసీ, నిర్మాణ సంస్థపై కూడా అదే విధంగా కేసులు పెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి.


అయితే, సినీ లోకం సాయి ధరమ్ తేజ్‌కు అండగా నిలిచింది. ఆయన బాధ్యతగా హెల్మెట్ ధరించి మాత్రమే బైక్ డ్రైవ్ చేశారని, తక్కువ వేగంతోనే వెళ్లారని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మద్దతు పలికారు. రోడ్డుపై మట్టి లేదా ఇసుక ఉండడమే సాయి ప్రమాదానికి కారణమని తేల్చారు. 


స్పందించిన జీహెచ్ఎంసీ.. భారీ ఫైన్
ఈ క్రమంలో జీహెచ్ఎంసీ స్పందించింది. ప్రత్యేక చర్యలు చేపడుతూ రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తూ ఉంది. భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు చేపడుతోంది. మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు తాజాగా జీహెచ్‌ఎంసీ రూ.లక్ష జరిమానా వేసింది. ఆ సంస్థ చేస్తున్న నిర్మాణ పనుల వల్ల మట్టి, ఇసుక రోడ్లపై పడుతుండడంతో జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు సత్వర చర్యలు తీసుకున్నారు.


హీరో సాయిధరమ్ తేజ్ మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి వంతెనకు సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న సాయితేజ్ రోడ్డుపై ఇసుక ఉండడంతో అదుపుతప్పి కిందపడ్డారు. హెల్మెట్ ధరించడంతో సాయితేజ్‌కు పెను ప్రమాదం తప్పింది. కానీ, కాస్త ఎక్కువగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్ననే (సెప్టెంబరు 13) ఆయనకు కాలర్ బోన్ శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతం అయినట్లుగా వైద్యులు ప్రకటించారు.


Also Read: Nalgonda: ఇంట్లో ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన కోడలు.. చూసేసిన మామయ్య, చివరికి దారుణం


Also Read: Hyderabad: మియాపూర్ లో దారుణం.. 13 నెలల చిన్నారి అనుమానాస్పద మృతి... బాలిక కళ్లు పొడిచి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు


Also Read: Revanth Reddy: హత్యాచార బాలిక కుటుంబానికి రేవంత్ పరామర్శ.. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్