ఆంధ్రప్రదేశ్ యువత నైపుణ్యాలు పెంచే దిశగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రతి లోక్‌సభ నియోజవవర్గానికి ఓ స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే విశాఖలో  హైఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీ, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీని పెట్టాలని నిర్ణయించారు. కాలేజీల్లో చేపట్టాల్సిన కోర్సులు..  ఇతర కరికులంను హైఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీ, స్కిల్‌ యూనివర్శిటీలు కలిసి నిర్ణయిస్తాయి. కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీలాంటి అంశాల్లో ఈ కాలేజీల్లో బోధన, శిక్షణ ఉంటుందని వివరించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం జగన్మోహన్ రెడ్డి జరిపిన సమీక్షలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. Also Read : టీడీపీలో ఏం జరుగుతోంది ?

  
విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ పనులను వెంటనే మొదలుపెట్టాలని సమీక్షలో పాల్గొన్న అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కోర్సులు మాత్రమే కాదు తరగతి గదుల నిర్మాణం కూడా వినూత్నంగా ఉండాలనిసూచించారు. కొత్తగా నిర్మించనున్న వైద్య కళాశాలల తరగతి గదుల నిర్మాణంలో వినూత్న పద్ధతులు పాటించాలని నిర్దేశించారు. భవనాలు, తరగతి గదుల నిర్మాణంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేయాలని ఆదేశించారు. Also Read : ఏపీ ఫైబర్‌ నెట్ లో జరిగిన స్కామేంటి..?


స్కిల్డ్ యూనివర్శిటీలు, కాలేజీల్లో నైపుణ్యాలు పెంచుకునేవారి జాబితాను  కొత్తగా వచ్చే పరిశ్రమలకు పంపాలన్నారు.  శిక్షణ పొందిన వారి డేటాను వారికి పంపితే అర్హులైన వారిని ఎంపిక చేసుకుని 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తారని తెలిపారు.  నైపుణ్యంలేని మానవ వనరుల కారణంగా మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు సరిగ్గా నడవడం లేదు. నిర్వహణ కూడా సరిగా ఉండడం లేదని సీఎం జగన్ విశ్లేషించారు. అందుకే  రోజువారీ జీవితంతో సంబంధం ఉన్న అంశాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మన చేప- మన ఆరోగ్యం... ఏపీలో సర్కారు వారి చేపలు...!


ఇక ఐటీఐలను నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐటీఐలో నియోజకవర్గ స్థాయిలో  స్కిల్ కాలేజీలుగా ఉంటాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికేషన్‌ చేయించాలని..  ప్రతి కళాశాల, ఐటీఐ కూడా నిర్దేశిత ప్రమాణాలను సాధించేలా అడుగు ముందుకేయాలన్నారు.  ప్రతినెలా మూడురోజులపాటు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యేలా వారికి కేటాయించాలని ఇది వరకే ఆదేశాలు జారీ చేశామని.. ఆ సమావేశాలు కొనసాగించాలన్నారు. సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన గౌతం రెడ్డి స్కిల్ కాలేజీల కోసం త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ప్రతి జిల్లాలో నైపుణ్యం, ఉపాధిని అనుసంధానించే విధంగా ఒక అధికారిని నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. Also Read : శ్రీవారి బ్రాండ్ అగర్‌బత్తీలు.. ప్రత్యేకతలు ఇవే ..!