French Man Drugged Wife: ఫ్రాన్స్ లో దారుణం వెలుగు చూసింది. కనీవినీ ఎరుగని రీతిలో బయటపడ్డ ఈ ఘోరం చాలా మందిని షాక్ కు గురిచేస్తోంది. కట్టుకున్న భార్యను పరాయి పురుషులు అనుభవించేలా ప్రోత్సహించాడో భర్త. దాదాపు పదేళ్ల పాటు ఈ ఘోరానికి ఒడిగట్టాడు. భార్యకు మత్తు మందు ఇచ్చి తనను ఇతర వ్యక్తులతో రేప్ చేయించి వాటిని వీడియోలు తీశాడు. ఆమెను అత్యాచారం చేసిన వారిలో ఫైర్ మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, బ్యాంకు ఉద్యోగి, జైలు గార్డు, నర్స్, ఓ జర్నలిస్టు సహా ఇతర రంగాలకు చెందిన వారు ఉన్నారు. 26 ఏళ్ల వ్యక్తి నుంచి 73 ఏళ్ల వృద్ధులు కూడా ఆమెను అత్యాచారం చేసినట్లు తేలింది. 


పరాయి వ్యక్తులతో భార్యపై అత్యాచారం


ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఫ్రాన్స్ లోని మజాన్ కు చెందిన డొమినిక్ పి అనే ఫ్రెంచ్ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య తీసుకునే ఆహారంలో రోజూ రాత్రి ఓ డ్రగ్ కలిపే వాడు. యాంటీ యాంగ్జైటీ డ్రగ్ లోరాజెపామ్ ను కలిపి ఆమె స్పృహ కోల్పోయేలా చేసేవాడు. తన భార్య మత్తులోకి జారుకున్న తర్వాత పరాయి పురుషులను ఇంటికి పిలిచి ఆమెను అత్యాచారం చేయించే వాడు. అతిథులు తన భార్యపై లైంగిక దాడికి పాల్పడుతుంటే ఆ దృశ్యాలను రికార్డ్ చేసే వాడు. వాటన్నింటిని ఓ యూఎస్బీ పెన్ డ్రైవ్ లో ఎబ్యూసెస్ పేరుతో ఫోల్డర్ క్రియేట్ చేసి దాచినట్లు టెలిగ్రాఫ్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఆమె మత్తులో ఉన్నప్పుడు అత్యాచారం చేసిన వారిలో 26 ఏళ్ల వ్యక్తి నుంచి 73 ఏళ్ల వ్యక్తులు ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన వారు ఈ దారుణంలో భాగమయ్యారు. 


పెళ్లై 50 ఏళ్లు, ముగ్గరు పిల్లలు కూడా.. 


డొమినిక్ కు, బాధితురాలికి 50 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలకు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణాలు 2011 నుంచి 2020 మధ్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తుల్లో కొందరు మళ్లీ మళ్లీ వచ్చే వారని పోలీసులు గుర్తించారు. ఈ దారుణమైన ఘటనపై మొత్తం 92 కేసులు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 


ఆన్‌లైన్ ఫోరమ్ ద్వారా పరిచయాలు, వారితో అత్యాచారాలు


'ఏ సన్ ఇన్సు' అనే పిలిచే ఓ ఆన్ లైన్ ఫోరమ్ ద్వారా డొమినిక్ పి ఇతర నిందితులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ ఆన్ లైన్ ఫోరమ్ లో సభ్యులు తమ లైంగిక అవసరాలు, లైంగిక కోరికలు, ఫాంటసీల గురించి ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. అలా వారితో ఏర్పడ్డ లైంగిక పరమైన పరిచయాన్ని డొమినిక్ ఇలా వాడుకున్నాడు. ఈ ఫోరమ్ లోని సభ్యులు భాగస్వామితో లైంగిక ఏకాభిప్రాయం కుదరని సమయాల్లో మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడుతుంటారు. దానినే డొమినిక్ ఇక్కడ ఫాలో అయ్యాడు. భార్యకు మత్తు ఇచ్చి ఫోరమ్ సభ్యులను ఇంటికి పిలిపించి లైంగిక దాడి చేయించే వాడు. ఇదంతా రికార్డు చేసేవాడు. 


భార్య మత్తు నుంచి లేవకుండా జాగ్రత్తలు


భార్య మత్తు నుంచి లేవకుండా డొమినిక్ జాగ్రత్తలు పాటించేవాడని టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. పొగాకు, పెర్ఫ్యూమ్ లాంటి ఘాటైన వాసనల వల్ల మత్తు నుంచి భార్య లేస్తుందోనని వాటికి ముందే నో చెప్పే వాడు. తన ఇంటికి వచ్చే వారు తమ నుంచి ఘాటైన వాసన రాకుండా చూసుకోవాలని ముందే షరతు పెట్టేవాడు. అలాగే ఇంటికి వచ్చే పరాయి పురుషులు తమ దుస్తులను బాత్రూమ్ లో కాకుండా.. వంటింట్లోనే విప్పేయాలని చెప్పేవాడు. అలాగే బయటి నుంచి వచ్చిన వారి చేతులు చల్లగా ఉంటాయి కాబట్టి   వేడి నీటితో చేతులు కడుక్కోవాలని చెప్పేవాడు. ఇంటికి వచ్చే వారు దూరంగా ఉన్న ఓ స్కూల్ వద్ద వాహనాలు పార్కు చేసి నడుచుకుంటూ ఇంటికి రావాలని చెప్పే వాడు. 


'మత్తు వదిలినా పని ఆపొద్దు'


మత్తులో ఉన్న తన భార్యపై లైంగిక దాడి చేస్తున్నప్పుడు ఒకవేళ తను మేల్కొంటే.. రేప్ చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లో మధ్యలో ఆపకూడదని గట్టిగా చెప్పేవాడు డొమినిక్. అలాగే తన భార్యను అత్యాచారం చేయమని ఎవరినీ బలవంత పెట్టేవాడు కాదని ప్రాసిక్యూటర్ లను ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. వారికి ఇష్టమైతేనే వచ్చి రేప్ చేయాలని చెప్పేవాడట. 


Also Read: Yoga Day Guinness Record: ఒకేసారి 1.53 లక్షల మందితో యోగాసనాలు, గిన్నిస్ రికార్డు నెలకొల్పిన సూరత్


ఈ దారుణం ఎలా బయటపడింది?


దాదాపు పదేళ్లుగా సాగిన ఈ దారుణం మత్తులో ఉన్న తన భార్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు డొమినిక్. రోజంతా మాములుగానే ఉండేవాడు. రాత్రి అయ్యాక మాత్రమే ఫుడ్ లో మత్తు మందు కలిపి దారుణం చేసే వాడు. దీంతో ఆమెకు ఈ ఘోరం గురించి తెలియలేదు. అయితే 2020 లో డ్రెస్ ఛేంజింగ్ రూములో మహిళలు బట్టలు మార్చుకునేటప్పుడు రహస్య కెమెరాను ఉపయోగిస్తున్నట్లు పోలీసులకు అనుమానం వచ్చి డొమినిక్ ను పట్టుకున్నారు. వారి శైలిలో ప్రశ్నించడంతో అసలు వ్యవహారం బయట పడింది. ఈ దారుణం గురించి తెలుసుకున్న డొమినిక్ భార్య షాక్ లోకి వెళ్లింది. తర్వాత ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial