Joint Astronaut Mission: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి లాన్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న మోదీ.. అక్కడి నుంచి నేరుగా వాషింగ్టన్ చేరుకున్నారు. మోదీ అమెరికాలో ఉండగానే భారత్ పై పలు వరాలను కురిపించింది యూఎస్. భారత్ లో కొత్తగా కాన్సులేట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. తొలిదశలో రెండు నగరాను ఎంపిక చేసింది. సిలికాన్ వాలీ ఆఫ్ ఇండియాగా పేరున్న బెంగళూరులో కొత్తగా కాన్సులేట్ ను ఏర్పాటు చేయనుంది. మరొకటి ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది తెలియాల్సి ఉంది. తాజాగా మరో ప్రకటన వెలువరించింది వైట్ హౌజ్.


ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకాలు


భారత్- అమెరికా కలిసి రోదసి యాత్రలు చేపట్టనున్నట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. ఇస్రో, నాసా సంస్థలు కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు ఇకపై సంయుక్తంగా ప్రాజెక్టులను పంపించనున్నట్లు పేర్కొంది. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ ఒప్పందాలపైనా ఈ రెండు దేశాలు సంతకం చేసినట్లు వైట్ హౌజ్ పేర్కొంది. 


కలిసి కట్టుగా నాసా-ఇస్రో ప్రాజెక్టులు


1967 నాటి అమెరికా ఔటర్ స్పేస్ ట్రీటీ (OST) ప్రకారం 21వ శతాబ్దంలో పౌర అంతరిక్ష అన్వేషణలో భాగంగా నాసా ఆర్టెమిస్ మిషన్ ను చేపట్టాల్సి ఉంది. ఈ మిషన్ ను ఇది వరకే ప్రయోగించింది కూడా. అయితే దీని ప్రధాన లక్ష్యం మాత్రం 2025 నాటికి మనుషులను చంద్రుడిపైకి పంపడం. అంగారక గ్రహంపైకి కూడా మనుషులను పంపించాలన్న లక్ష్యాన్ని కూడా ఈ ఆర్టెమిస్ లో సవరణలు చేసి చేర్చారు. మరోవైపు ఇస్రో కూడా చాంద్రయాన్ వంటి మిషన్ లను చేపట్టింది. మానవ సహిత ప్రయోగనానికి కూడా ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. ఇకపై ఇస్రో చేసే ప్రాజెక్టుల్లో నాసా కూడా భాగం కానుంది. కలిసి కట్టుగా ప్రాజెక్టులను రెండు సంస్థలు కలిసి ముందుకు తీసుకెళ్లనున్నాయి. ఈ మేరకు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసినట్లు వైట్ హౌజ్ వెల్లడించింది. నాసా-ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్రకు అవసరమైన స్ట్రాటజిక్ ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ధి చేస్తామని వైట్ హౌజ్ స్పష్టం చేసింది.


Also Read: Modi US Visit: బైడెన్‌తో కలిసి తొలిసారి ప్రధాని మోదీ ప్రెస్‌మీట్, రిపోర్టర్లకు ఆ కండీషన్ పెట్టిన అధికారులు


అంతకుముందు ప్రధాని మోదీకి సాదర స్వాగతం


 ప్రధానిమోదీకి వైట్ హౌస్ వద్ద అద్భుతమైన స్వాగతం లభించింది. న్యూయార్క్ పర్యటన ముగించుకుని వాష్టింగ్టన్ డీసీకి చేరుకున్న మోదీకి అమెరికా అధికారులు, భారత రాయబారులు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. మోదీ వాష్టింగ్టన్ చేరుకునే సరికి వర్షం పడుతుండగా..ఆ వర్షంలో తడుస్తూనే తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన చిన్నారులను, ప్రవాస భారతీయులను మోదీ పలకరించారు. అక్కడి నుంచి వైట్ హౌస్ కు చేరుకున్న ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధమ మహిళ జిల్ బైడెన్ ఘనంగా స్వాగతం పలికారు. మోదీని ఆత్మీయంగా పలకరిస్తూ వైట్ హౌస్ లోకి తీసుకువెళ్లారు. వైట్ హౌస్ అధికారికంగా మోదీ కోసం అఫీషియల్ డిన్నర్ ను ఏర్పాటు చేసింది. 


ఆ సమయంలోనే బైడెన్ దంపతులు ప్రధాని మోదీకి పాత కెమెరాను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇటు ప్రధాని మోదీ మాత్రం జో బైడెన్ సతీమణి జిల్‌ బైడెన్‌కి గ్రీన్ డైమండ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ వజ్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్పెషల్ డైమండ్‌ని తయారు చేశారు. సాధారణంగా ఓ వజ్రాన్ని వెలికి తీసినప్పుడు అందులో ప్రతి క్యారట్‌కి కనీసం 125 పౌండ్ల కార్బన్ ఉంటుంది. కానీ మోదీ జిల్ బైడెన్‌కి ఇచ్చిన గ్రీన్ డైమండ్‌లో మాత్రం క్యారట్‌కి 0.028 గ్రాముల కార్బన్ మాత్రమే ఉంటుంది. మరో హైలైట్ ఏంటంటే.. పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా దీన్ని తయారు చేశారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial