Trump Comments On Nuclear Weapons: ఈ ప్రపంచానికి అతి పెద్ద ముప్పు అణ్వస్త్రాలని అమెరికా మాజీ అధ్యక్షుడు.. ప్రస్తుత రిపబ్లికన్‌ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అందరూ భూతాపం, పర్యావరణాల గురించి మాట్లాడుతుంటారని.. తను మాత్రం ప్రపంచ దేశాల దగ్గర ఉన్న ఈ న్యూక్లియర్‌ స్టాక్‌ ఫైల్స్‌నే పెను విపత్తుగా భావిస్తానని అన్నారు. ఆఖరికి పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్‌ను అందిపుచ్చుకుందంటూ దాయాది దేశంపై ట్రంప్ కాస్త చులకన భావంతో మాట్లాడారు. మిషిగన్‌లో ఎన్నికల క్యాంపైన్‌లో పాల్గొన్న ట్రంప్‌.. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మానవాళికి పెను విపత్తును తెచ్చి పెట్టే ఈ అణ్వస్త్రాలపై తానే స్వయంగా నిఘా ఉంచే వాడినని.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయి.. పాకిస్తాన్‌ కూడా తన స్టాక్‌ ఫైల్స్ పెంచుకునే పరిస్థితికి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచదేశాలు ముఖ్యంగా పాకిస్తాన్‌, చైనా సహా మన దేశంలో ఉన్న న్యూక్లియర్ స్టాక్‌ఫైల్స్ ఎన్ని వాటి లక్ష్యాలు ఏంటన్నది ఈ కథనంలో తెలుసుకుందా.. !


2025 నాటికి 200 అణ్వస్త్రాలు సిద్ధం చేయడమే పాక్‌ లక్ష్యం.. మరి భారత్ ఎక్కడ..?


అణ్వస్త్రాల తయారీని మాత్రం పక్కన పెట్టలేదు. 2023 సెప్టెంబర్ నాటికి పాక్ దగ్గర 170 వరకు అణు వార్‌ హెడ్స్ ఉన్నాయని తేలింది. ఆ సంఖ్యను 2025 నాటికి 200కి చేర్చాలని లక్ష్యంగా ఆ దేశ అణు శాస్త్రవేత్తలు పని చేస్తున్నట్లు అనేక నివేదికలు పేర్కొన్నాయి. వాస్తవానికి పాక్ ఎన్నడూ తన న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి వాస్తవాలు చెప్పింది లేదు. అందుకే పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉంటాయన్న విషయంలో నిర్దారణ లేనప్పటికీ.. అవి సిద్ధం చేస్తున్న లాంచ్ పాడ్స్ ఆధారంగా వీటిని లెక్కగట్టినట్లు అమెరికా అణు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి యావరేజ్‌గా 14 నుంచి 27 వార్‌ హెడ్స్‌ను కొత్తవి ఆ దేశం డెప్లాయ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా.. వాస్తవంలో కనీసం ఏడాదికి 5 నుంచి 10 వార్‌హెడ్స్ సిద్ధం చేస్తుంటుందని అంచనా. పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలను విడుదల చేయడానికి అనువైన యుద్ధ విమానాలు 36 ఉన్నాయని.. ఉపరితలం నుంచి లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్ మిసైల్‌ వ్యవస్థలు ఆరు వరకు ఉన్నట్లు న్యూక్లియర్ కాలమ్ తెలిపింది. ఇంకా షార్ట్‌ రేంజ్ మిసైల్స్ అబ్దాలి, ఘజ్నావి, షాహీన్, నాసర్‌తో పాటు మీడియం రేంజ్ ఘౌరీ, షాహీన్‌-2 వంటి వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి. పాకిస్తాన్ తన దగ్గర ఉన్న అణ్వస్త్రాలతో భారత్‌లోని కీలక పట్టణాలపై దాడులు చేయగల సత్తా కలిగి ఉంది.


భారత్ దగ్గర ఈ జనవరి 2024 నాటికి 172 అణ్వస్త్రాలు ఉన్నాయి. భారత్‌ కూడా గగన తలం నుంచి గగన తల లక్ష్యాలు ఛేదించగల మిసైల్ వ్యవస్థలతో పాటు ఉపరితలం నుంచి గగనతలంలో ఉన్న వాటిని పేల్చే క్షిపణులు, ఖండాంతర క్షిపణులును సిద్ధం చేసుకుంది. భారత్ తన అణ్వస్త్రాలను పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాలన్నింటితో పాటు చైనాలోని అనేక నగరాలను లక్ష్యం చేసుకొని రూపొందించింది. భారత్ ఎప్పుడూ తన అణ్వస్త్రాలను శాంతి కోసమే ఉపయోగిస్తుంది. చైనా దగ్గర కూడా 500 వరకు అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ మూడు దేశాలు అమెరికా, రష్యా, యూకే, ఉత్తర కొరియా, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌తో కలిసి అణ్వస్త్ర కూటమిలో భాగమై ఉన్నాయి. ఏటా వాటి దగ్గర ఉన్న అణ్వస్త్రాల లెక్కను ఎప్పటికప్పుడు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి అందించాల్సి ఉంటుంది. 2023లో ఈ అణ్వస్త్రాల తయారీకి పాకిస్తాన్ ఒక బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని.. అంటే నిమిషానికి 1924 డాలర్లు ఈ ప్రోగ్రామ్ కోసం వెచ్చించిందని.. 2023లో ఆ మొత్తాన్ని దేశంలో ఉన్న పేదల కోసం ఖర్చు పెడితే.. గోధుమ పిండి ప్యాకెట్ల కోసం వాళ్లు పాట్లు పడే పరిస్థితి వచ్చి ఉండేదని కాదని అంతర్జాతీయ సంబంధాలపై నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో భారత్‌ కూడా 2.7 బిలియన్ డాలర్లు ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కోసం వెచ్చించినట్లు నివేదికలు చెబుతున్నాయి.


Also Read: బతకడం చాలా ఈజీ - ఈ ప్రకటన చూసిన తర్వాత మీరే నమ్ముతారు !


2024 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయి..?


2024 జనవరి నాటికి.. సిప్రి దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం.. ప్రపంచ దేశాల దగ్గర 12 వేల 121 అణ్వాయుధాలు ఉండగా.. వాటిలో 9 వేల 585 అస్త్రాలు ఇప్పటికే మిలటరీ చేతుల్లోకి వెళ్లాయని.. అవసరమైనప్పుడు మిలటరీ వాటిని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని.. సిప్రి వెల్లడించింది. వీటిలో 2 వేల 100 అణ్వస్త్రాలు ఖండాంతర క్షిపణుల రూపంలో ఉన్నాయని.. అవి ఎప్పుడైనా ప్రయోగించడానికి అణువుగా సిద్ధంగా ఉంచారని.. వీటిలో ఎక్కువ భాగం అమెరికా, రష్యావి కాగా.. చైనా కూడా వాటి తర్వాత ఉంది. అమెరికా దగ్గర మొత్తం 3 వేల 708 అణ్వస్త్రాలు ఉండగా.. వాటిలో డెప్లాయ్ చేసిన వార్‌ హెడ్స్‌ 17 వందల 70. రష్యా దగ్గర 4 వేల 380 అణ్వస్త్రాలు ఉండగా.. వాటిలో 17 వందల 10 డెప్లాయ్ చేసి ఉంచారు. యూకే దగ్గర 225 ఉండగా.. ఫ్రాన్స్ దగ్గర 290 ఉన్నాయి. ఉత్తర కొరియా దగ్గర 50 అణ్వస్త్రాలుండగా.. మధ్యప్రాశ్చ్యం మొత్తాన్ని శాసిస్తున్న ఇజ్రాయెల్ దగ్గర 90 వరకూ అణ్వస్త్రాలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి న్యూక్లియర్ స్టాక్‌ ఫైల్స్ పెంచుకోవడంపై నిఘా సహా కట్టడికి చర్యలు తీసుకుంటున్న సమయంలోనే ఉక్రెయిన్ యుద్ధం, గాజాపై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.


Also Read: ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్