Viral Advertisement : ఈ బిజీ ప్రపంచంలో బతకడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు ఎక్కువ మంది. కానీ చాలా సులువు అని నిరూపించేవారు కూడా ఉంటారు. అలాంటి వారి టాలెంట్ తరచూ బయటపడుతూనే ఉంటుంది. ఇలాంటి బతకనేర్చిన ఓ యువకుడు నేరుగా పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. మీ వ్యాపారాలను బాగు చేస్తానని.. నష్టాలు వస్తూంటే.. లాభాల్లోకి వచ్చేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చేస్తారంటే.. బోణీ చేస్తారట. మీరు నిజమే చదివారు. ఉదయమే దుకాణం తీసినప్పుడు వచ్చి బోణి చేస్తాడట.
తన చేయి మంచిదేనట !
వ్యాపారాలు చేసే వారికి మొదట బోణి అనేది ఓ సెంటిమెంట్. దుకాణం తెరవగానే ఎవరైనా మంచి చేయి ఉన్న వ్యక్తి బోణి చేస్తే ఆ రోజు వ్యాపారం సూపర్ గా ఉంటుందని అనుకుంటారు. ఇలాంటి సెంటిమెంట్ ను ఆ యువకుడు క్యాచ్ చేశాడు. వెంటనే.. పేపర్ లో ప్రకటన ఇచ్చారు. తన చేయి ఎంతో మంచిదని చెప్పుకున్నారు. తాను బోణీ చేస్తానని దాని వల్ల లాభాలు వస్తాయని.. బిజినెస్ బాగా జరుగుతుందని ప్రకటించుకున్నారు. అతని చేయి ఎంత బాగుంటుందన్న సంగతి ఎవరికీ తెలియదు. కానీ అసలు అలాంటి ఐడియా ఎలా వచ్చిందనేది ఆలోచిస్తే.. అతనికి ఎలా వచ్చిందన్న సంగతి తర్వాత అసలు మనకెందుకు రాలేదని ఆలోచించుకోవాల్సి రావొచ్చు.
చంద్రబాబుపై సుప్రీంకోర్టుకెళ్తా - వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్
బోణి చేస్తే వ్యాపారాలు బాగుంటాయట !
ఆ యువకుడు తన డీటైల్స్ ఇవ్వలేదు కానీ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీన్ని తన సేవగా చెబతున్నాడు. ఈ సేవకు చార్జీలు వసూలు చేస్తాడు. ఎంత అనేది అతనిపై ఎదుటి వ్యక్తి .. వ్యాపారి ఎంత నమ్మకం పెట్టుకున్నాడన్నదానిపైనే ఉంటుంది. అలాగే వ్యాపారం స్థాయిని బట్టి ఉంటుంది. మంచి పార్టీ దొరికితే మనోడి హ్యాండ్‌కు లక్షలు కూడా వచ్చే చాన్స్ ఉంది. ఓ పది మంది ఇలా ఈ యువకుడి సర్వీస్ తీసుకుంటే.. ఓ ఇద్దరు ముగ్గురి వ్యాపారాలు ఆ తర్వాత బాగుపడినా.. అతని చేయి బాగుంటందని పిలిచి మరీ కానుకలుఇస్తారు. చాలా మంది జాతకాలు చెప్పేవాళ్లు చేసే ప్లాన్ ఇదే.
కేతిరెడ్డి, విడదల రజనీ కూడా జనసేన దారిలో - అపాయింట్‌మెంట్లు ప్రస్తుతానికి పెండింగ్ !?
బతకడం ఎలాగో నేర్పుతున్న యువకుడు
ఈ యువకుడు ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువకుడికి ఎంత మంది ఫోన్లు చేశారో కానీ.. బతకడం ఎంత ఈజీనో.. తెలుసుకోవచ్చన్న సెటైర్లు మాత్రం వినిపిస్తున్నాయి.