Bengaluru bye bye Piyush Goyal wants a new Silicon Valley for India : భారత్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు. అయితే ఇప్పుడు కొత్త సిలికాన్ వ్యాలీని రెడీ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. NICDC సిలికాన్ వ్యాలీగా ఓ కొత్త సిటీని డెలవప్ చేస్తుంది. ఇందులో ఎంట్రపెన్యూర్స్, స్టార్టప్స్, ఇన్నోవేటర్స్ అందరికీ అవకాశాలు ఉంటాయి.. అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రసంగం ఇప్పుడు కర్ణాటకలో సెగలు రేపుతోంది. ఆయన ఇక బెంగళూరు అవసరం లేదన్నట్లుగా అక్కడ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరమే లేదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలో అక్కడి రాజకీయ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలు ఎలాంటి స్పందన వ్యక్తం చేయనప్పటికీ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు మాత్రం... బెంగళూరు కూడా ఇండియాలోనే ఉందన్న సంగతిని గుర్తుంచుకోవాలని బీజేపీకి, కేంద్రానికి సలహాలిస్తున్నారు. 


NICDC అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్. ఈ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరును మించిన సిలికాన్ వ్యాలీని నిర్మించాలని పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.  



 

ఈ పిలుపుపై కర్ణాటక మంత్రి ఎంపీ పాటిల్ వెంటనే స్పందించారు. పీయూష్ గోయల్ .. మన సొంత సిలికాన్ వ్యాలీని నిర్మించుకోవాలని అన్నారని.. బెంగళూరు ఇండియాలో లేదా అని ప్రశ్నించారు. బెంగళూరు ఒక్క రోజులో నిర్మితం కాలేదని అది గ్లోబల్ సిటీ అని స్పష్టం చేశారు.  



 

బై బై బెంగళూరు అంటే.. బైబై భారత్ అని చెప్పినట్లేనని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే స్పష్టం చేశారు.   అయితే కొంత మంది బెంగళూరును సిలికాన్ వ్యాలీగా  కేంద్రమంత్రి అంగీకరించారని.. మరో సిలికాన్ వ్యాలీని అభివృద్ది చేసుకోవాలని మాత్రమే సూచించారని అంటున్నారు.   





ఈ వివాదంపై పీయూష్ గోయల్ ఇంకా ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు. బెంగళూరును తక్ుకవ చేసి గుజరాత్ లో మరో సిలికాన్ వ్యాలీని నిర్మించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని .. కర్ణాటక నేతలు మండి పడుతున్నారు.