Boston Train On Fire: అమెరికాలోని బోస్టన్ శివార్లలో ఓ రైలులో మంటలు చెలరేగాయి. బ్రిడ్జిపై రైలు వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు హడలిపోయారు. కొంతమంది వంతెన కింద ఉన్న నదిలోకి దూకేశారు.
ఇదీ జరిగింది
వెల్లింగ్‌టన్, అసెంబ్లీ స్టేషన్‌ల మధ్య ఉన్న వంతెన మీదుగా ప్రయాణిస్తోన్న ఆరెంజ్ లైన్ రైలుకే ఈ ప్రమాదం జరిగింది. రైలు హెడ్ కార్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. కానీ మంటలను చూసి కొంతమంది పాసింజర్లు భయపడి నదిలోకి దూకేశారు.
మరి కొంతమంది కిటికీలో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దాదాపు 200 మంది ప్రయాణికులను ఈ ప్రమాదం నుంచి కాపాడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ రైలు ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ పాసింజర్లు మాత్రం ప్రమాద సమయంలో గందరగోళానికి గురయ్యారు. కొంతమంది నదిలోకి దూకి పారిపోయారు.
Also Read: Polio Case In USA: మళ్లీ పుట్టుకొచ్చిన పోలియో- దశాబ్దం తర్వాత అమెరికాలో మళ్లీ కలకలం!
Also Read: Monkeypox Cases India: దేశంలో మూడో మంకీపాక్స్ కేసు- మళ్లీ కేరళలోనే!