Wife Imposing Her Friends Family At Husband Residence Against His Will Amounts To Cruelty: భర్తకు ఇష్టం లేకుండా తన కుటుంబసభ్యులను భర్త ఇంట్లోకి బలవంతంగా తీసుకు వచ్చి అక్కడే ఉండిపోయేలా చేయడం క్రూరత్వం కిందకు వస్తుందని కోల్కతా హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో వెల్లడించింది. అలాగే మిత్రుల్ని కూడా తీసుకు వచ్చి అలా ఇంట్లో ఉంచేసినా కూడా క్రూరత్వమేనని తెలిపింది. తన భార్య తన ఇష్టం లేకుండా భార్య, మిత్రుల్ని తెచ్చి తన ఇంట్లో పెట్టిందని ఆమెతో కలిసి ఉండలేనని విడాకులు మంజూరు చేయాలని ఓ భర్త పెట్టుకున్న పిటిషన్ ను కోల్ కతా హైకోర్టు పరిష్కరించింది. విడాకులు మంజూరు చేసింది. 


కోల్ కతాకు చెందిన ఓ జంట స్పెషల్ మ్యారెజెస్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఆ భర్త ఉద్యోగ సంస్థ కేటాయించిన క్వార్టర్‌లో కాపురం పెట్టారు. కొద్ది రోజులకు తన ఫ్రెండ్ అంటూ ఒకామెను భార్య ఇంటికి తెచ్చింది. ఒకటి,రెండు రోజులు ఉండి వెళ్లిపోతుందేమోనని ఆ భర్త అనుకున్నాడు. కానీ ఆమె అక్కడే తిష్టవేసింది. భార్య కూడా తన ఫ్రెండ్ ఇక తనతోనే ఉంటుందని .. వెళ్లిపొమ్మని చెప్పినప్పుడల్లా గొడవలు పెట్టుకుంది. కొద్ది రోజులకు ఆ భార్య తల్లి కూడా ఇంటికి వచ్చింది. ఆమె కూడా చుట్టపు చూపుగా వచ్చిందని ఆ భర్త అనుకున్నాడు కానీ.. ఆమె కూడా ఇంట్లోనే ఉండిపోవడానికి వచ్చింది. 


Also Read:  అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?


పెళ్లి చేసుకున్నది భార్యనేనని ఆమె ఫ్రెండ్, తల్లిని పోషించాల్సిన అవసరం లేదని వారిని ఇంటి నుంచి పంపేయడానికి ఆ భర్త చాలా ప్రయత్నాలు చేశారు. ఆయితే వారు వినలేదు. భర్తను పట్టించుకోవడం మానేసి పూర్తిగా వారు ఆ ఇంట్లో పెత్తనం చేయడం ప్రారంభించారు. దీంతో భర్తతో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడటం ప్రారంభించారు. చివరికి ఇలా కాదని.. వారిని పంపేయకపోతే విడాకులు తీసుకుందామని  హెచ్చరించారు. అప్పటికి  ఆ భార్య విడాకులు ఎలా ఇస్తావో చూస్తానని అంతే కానీ.. తన ఫ్రెండ్ ని, తల్లిని ఇంటి నుంచి పంపేది లేదని స్పష్టం చేసింది. 



Also Read: Kakinada Port Case: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ



దీంతో ఆ భర్త న్యాయపోరాటం ప్రారంభించారు. కింది కోర్టుల్లో ఆయనకు మంచి ఫలితాలు రాలేదు. తన బాధను. కింది కోర్టులు సరిగ్గా గుర్తించలేకపోయాని హైకోర్టులో పిటిషన్ వేశారు.  తన భార్యతో పాటు వచ్చిన స్నేహితురాలు, తల్లి వల్ల చాలా మానసిక సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నానని తెలిపారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. ఇలా భర్త కు ఇష్టం లేకుండా.. ఇంట్లోకి బలవంతంగా బంధువుల్ని, స్నేహితుల్ని తీసుకు వచ్చి ఉంచడం క్రూరత్వం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. వారికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది.