Andhra Pradesh Telangana Latest news - తెలంగాణ ప్రజలది తప్పు లేదు - జగన్ ఓటమి ఆశ్చర్యమే - కేటీఆర్ మనసులో మాటలు
తెలంగాణ ప్రజలతో తమకు గ్యాప్ వచ్చిందని.. తమ వైఖరి మార్చుకోవాల్సి ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కవిత బెయిల్ విషయంపై న్యాయనిపుణులతో చర్చించేందుకు ఐదు రోజుల కిందట ఢిల్లీ వచ్చిన హరీష్ రావు, కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కొంత మంది మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల గురించి కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీ రైతులకు గుడ్ న్యూస్- పెట్టుబడి సాయంపై అప్‌డేట్ వచ్చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే ఐదు కీలక హామీలను అమలు పరిచిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు మరో హామీని ప్రజలకు అందించాలని ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం త్వరలోనే ఆ తీపి కబురు అందించనుంది. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద అందించే 20 వేల రూపాయల పథకంపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఉపఎన్నికల టాస్క్ పెద్ద రిస్కే - జగన్ అంత సాహసం చేస్తారా ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వై నాట్ 175 అంటూ కొండంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయి. 151 అసెంబ్లీ స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోయింది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు. మరో విపక్ష పార్టీ ఏపీ అసెంబ్లీలో లేనందున.. 39  శాతానికిపైగా ఓట్లు వచ్చినందున తమకే ప్రతిపక్ష హోదా ఇస్తారని జగన్ ఆశించారు. కానీ గత అసెంబ్లీలో తమను ఘోరంగా అవమానించిన జగన్మోహన్ రెడ్డికి తాము గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ అనుకుంటోంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అలిగిన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి- గుడి బయటే కూర్చున్న లీడర్స్
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో ప్రోటోకాల్‌ వివాదం దుమారం రేపింది. అధికారుల తీరుపై అలిగిన మంత్రి పొన్నం, మేయర్‌ విజయలక్ష్మి గుడి బయటే ఉండిపోయరు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ్ చాలా వైభవంగా జరుగుతోంది. ఈ ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ఉదయాన్నే వచ్చారు. ఆ సమయంలో అధికారులు తమ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఫ్రీ సిలిండర్ల స్కీం కోసం చూస్తున్న వారికి భారీ ఊరట.. పెట్రోలియం మంత్రి కీలక ప్రకటన
దేశంలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే వార్త ఒకటి కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ వినియోగదారుల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సబ్సిడీకే సిలిండర్లు అంటూ ఎన్నికల్లో హామీలు ఇచ్చాయి. అయితే నకిలీ ఖాతాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండంటంపై కేంద్రం దృష్టి సారించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి