Revanth Reddy Appreciate Bharatiyadudu-2 Team: తెలంగాణ ప్రభుత్వం సూచించినట్టుగానే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా  భారతీయుడు-2 సినిమా టీం విడుదల చేసింది. మంచి భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు డ్రగ్స్‌కు దూరంగా ఉందామంటూ వీడియో క్రియేట్ చేశారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడయాలో పోస్టు చేశారు. ఇలాంటి రుగ్మతలపై పోరాడేందుకు ముందుకు వచ్చిన సినిమా బృందానికి రేవంత్ ధన్యవాదాలు చెప్పారు. 


వీడియోలో ఏం ఉందంటే...


మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. ప్లే సే నో డ్రగ్స్‌ అని హీరో కమల్‌ హాసన్‌ రిక్వస్ట్‌తో మొదలవుతుంది వీడియో.. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వీడియోలను తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని కమల్ అభినందించారు. 


మీ భవిష్యత్‌ మీ చేతుల్లోనే ఉంది. డ్రగ్స్ వద్దని చెప్పండని సిద్ధార్థ్‌ రిక్వస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని దర్శకుడు శంకర్, నటుడు సముద్రఖనితో కూడా చెప్పించారు.