Brinda OTT: త్రిష తొలి వెబ్ సిరీస్ బృంద స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది - ఎప్పుడు, ఎక్కడో చూడొచ్చు అంటే?

Trisha Brinda Web Series: త్రిష ప్రధాన పాత్రలో నటించిన తొలి వెబ్ సిరీస్ 'బృంద'. తాజాగా టీజర్ విడుదల చేశారు. అలాగే, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మరి, ఈ సిరీస్ ఏ ఓటీటీలో వస్తుంది? ఎప్పుడు వస్తుంది?

Continues below advertisement

Trisha Series: త్రిష... గ్లామర్ క్వీన్! సౌత్ ఇండియన్ స్టార్ యాక్ట్రెస్! తమిళ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆవిడ... నేషనల్ వైడ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. తెలుగులో అగ్ర హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసిన త్రిష... ఇప్పుడు ఓటీటీలో అడుగు పెడుతున్నారు. త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ 'బృంద'. లేటెస్టుగా టీజర్ విడుదల చేయడంతో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 

Continues below advertisement

సోనీ లివ్ ఓటీటీలో ఆగస్టు 2 నుంచి 'బృంద'
Brinda Web Series OTT Platform: త్రిషతో పాటు మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ నటుడు జయ ప్రకాష్, సీనియర్ కథానాయిక ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సమీ, రాకేందు మౌళి తదితరులు 'బృంద'లో నటించారు. 

Brinda Web Series Release Date: సోనీ లివ్ ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'బృంద'. ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. టీజర్ విడుదల చేయడంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో సిరీస్ విడుదల కానుంది.

'బృంద' టీజర్ ఎలా ఉంది? అందులో ఏముంది?
Brinda Web Series Teaser Review: 'మనలో ఉన్న కోపం, మోసం, ద్వేషం... వీటితో కాదు మనం పోరాడాల్సింది' అనే డైలాగుతో 'బృంద' సిరీస్ టీజర్ మొదలైంది. ఓ చిన్నారి జననం, మరొక బాలిక ముఖానికి పసుపు పూయడం, ఇంకొక వ్యక్తిని తీసుకు వెళ్లడం వంటివి చూపించారు.

'మనలో ఉన్న మంచితో మనం పోరాడాలి. అది మన నుంచి పోకుండా' అనే డైలాగ్ వచ్చినప్పుడు హీరోయిన్ త్రిషను చూపించారు. ఆ తర్వాత కొందరి మరణాలు, ఆ కేసులను త్రిష ఎలా సాల్వ్ చేశారు? అనేది కథగా తెలుస్తోంది. 'బృంద... ఈ ప్రపంచంలోకి మనం రాక ముందు ఎంత చెడు అయినా ఉండొచ్చు. కానీ, వెళ్లే ముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్లడం మన బాధ్యత' అని వచ్చే డైలాగ్ ఆసక్తి పెంచింది.

Also Read: ఓటీటీలోకి ఈ వారమే సుధీర్ బాబు 'హరోం హర' - Prime Video, ETV Winలో కాదు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?


'బృంద' దర్శక - రచయిత సూర్య మనోజ్‌ వంగాల మాట్లాడుతూ... ''ఆద్యంతం ఉత్కంఠగా సాగే థ్రిల్లర్ సిరీస్ ఇది. కథలో వచ్చే అనూహ్యమైన ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. త్రిష పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ఆవిడతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. క్రైమ్, డ్రామా, సస్పెన్స్ సిరీస్ ఇది! ఇప్పటి వరకు వచ్చిన ఈ జానర్ సినిమాలకు భిన్నంగా, కొత్తగా ఉంటుంది'' అని చెప్పారు. 
సూర్య మనోజ్‌ వంగాలా దర్శకత్వం వహించిన 'బృంద'కు శక్తికాంత్‌ కార్తిక్‌ సంగీతం అందించారు. సూర్య మనోజ్‌ వంగాలా, పద్మావతి మల్లాది స్క్రీన్‌ ప్లే రాశారు. ఈ సిరీస్ ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, సినిమాటోగ్రఫీ: దినేష్‌ కె బాబు, ఎడిటింగ్‌:  అన్వర్‌ అలీ.

Also Readప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?

Continues below advertisement